Saturday, November 15, 2025
Homeబిజినెస్Stock Market: నష్టాల్లో ఐటీ షేర్లు.. ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు..!

Stock Market: నష్టాల్లో ఐటీ షేర్లు.. ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు..!

 Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వారాంతం రోజు ఫ్లాట్‌గా ముగిశాయి. జీఎస్టీ సంస్కరణలతో స్టాక్ మార్కెట్లకు ఊతం లభిస్తుందంటే అదేం కనిపించట్లేదు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై ప్రకటన చేసిన సమయంలో స్టాక్ మార్కెట్లు మంచి లాభాల్ని నమోదు చేయగా.. సెప్టెంబర్ 3న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలోని జీఎస్టీ పాలక మండలి జీఎస్టీ సంస్కరణల్ని ప్రకటించారు. దాదాపు అన్ని రంగాల నుంచి.. వస్తువులపై జీఎస్టీ రేట్లు తగ్గనున్నాయి. అయినప్పటికీ.. స్టాక్ మార్కెట్లలో పెద్దగా చలనం లేదు.  సెప్టెంబర్ 4న సెషన్‌లో ఆరంభంలో మంచి లాభాలు నమోదు చేసినప్పటికీ.. ఆఖర్లో లాభాలేవీ కన్పించలేదు. ఒక దశలో సెన్సెక్స్ ఏకంగా 600 పాయింట్లకుపైగా పెరగ్గా.. చివరకు 150 పాయింట్ల లాభంతోనే ముగించింది. శుక్రవారం కూడా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్నప్పటికీ.. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో లాభాల్లో ప్రారంభమైన సూచీలు తర్వాత ఆ జోరును తగ్గించాయి. ఈ ఉదయం సెన్సెక్స్‌ 300 పాయింట్లకు పైగా లాభంతో, నిఫ్టీ 24,800 మార్క్‌ పైన ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. అయితే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో  మార్కెట్లు కాస్త ఒడిదొడుకులకు లోనయ్యాయి. చివరకు సెన్సెక్స్‌ 7 పాయింట్ల నష్టంతో 80,710.76 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ 50 పాయింట్లు క్షీణించి 24,750 వద్ద ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 14 పైసలు తగ్గి 88.26 వద్ద ఉంది. ఐటీ రంగ షేర్లు నష్టాల్లో ముగియగా.. ఆటోమొబైల్ రంగ షేర్లు రాణించాయి. దీంతో, స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి.

- Advertisement -

 Read Also: Chinnaswamy Stadium: చిన్నస్వామి స్టేడియంలో మ్యాచుల నిర్వహణ..!

ఆసియా- పసిఫిక్ మార్కెట్లు..

జపాన్‌పై ఆటో టారిఫ్‌లను 27.5 శాతం నుంచి 15శాతానికి తగ్గిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఈ పరిణామంతో ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు శుక్రవారం సానుకూలంగా ట్రేడ్‌ అవుతున్నాయి. జపాన్‌ నిక్కీ 1.39శాతం, దక్షిణ కొరియా కోస్పి 0.26శాతం, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ 0.58శాతం, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ 0.17శాతం మేర లాభంతో కొనసాగుతున్నాయి. అటు అమెరికా మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. ఎస్‌అండ్‌పీ సూచీ 0.83శాతం, నాస్‌డాక్‌ 0.98శాతం, డోజోన్స్‌ 0.77శాతం మేర పెరిగాయి.

 Read Also: GST reforms: జీఎస్టీ రేట్ల తగ్గింపుతో నష్టమే.. ఎస్బీఐ రిపోర్టులో వెల్లడి

రణ్ బీర్ కపూర్ మద్దతు ఉన్న కంపెనీ..

ఇదే సమయంలో రణ్‌బీర్ కపూర్ మద్దతు ఉన్న ఒక కంపెనీ స్టాక్ 10 శాతం అప్పర్ సర్క్యూట్ కొట్టింది. అదే ప్రైమ్ ఫోకస్ లిమిటెడ్. ఈ స్టాక్ సెప్టెంబర్ 5 సెషన్‌లో 10 శాతం అప్పర్ సర్క్యూట్ కొట్టింది. కిందటి సెషన్‌లో రూ. 143.98 వద్ద ముగియగా.. శుక్రవారం 7 శాతానికిపైగా లాభంతో రూ. 153 వద్ద ఓపెన్ అయింది. ఇదే ఊపులో 10 శాతం పెరిగి రూ. 158.37 వద్ద స్థిరపడింది. దీని మార్కెట్ విలువ రూ. 4.91 వేల కోట్లకు చేరింది. ఇక స్టాక్ 52 వారాల గరిష్ట ధర రూ. 181 కాగా.. కనిష్ట ధర రూ. 85 గా ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad