Homeబిజినెస్Airtel: ఎయిర్‌టెల్‌ యూజర్లకు బిగ్‌షాక్‌‌.. రూ. 299 ప్లాన్‌తో పాటు మరో రెండు ప్లాన్లకు గుడ్‌బై

Airtel: ఎయిర్‌టెల్‌ యూజర్లకు బిగ్‌షాక్‌‌.. రూ. 299 ప్లాన్‌తో పాటు మరో రెండు ప్లాన్లకు గుడ్‌బై

Shocking news for Airtel users: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ తన యూజర్లకు బిగ్‌ షాకిచ్చింది. ఎయిల్‌టెల్‌ కస్టమర్లు ఎక్కువగా రీఛార్జ్‌ చేసుకునే రూ. 299 విలువ గల ఎంట్రీ లెవల్‌ ప్రీపెయిడ్‌ రీఛార్జి ప్లాన్‌ను తొలగించింది. 28 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత కాల్స్‌ డేటా అందించే ఈ ప్లాన్‌కు గుడ్‌బై చెప్పింది. ఎయిర్‌టెల్‌ వెబ్‌సైట్‌, ఎయిర్‌టెల్‌ థాంక్స్‌ యాప్‌ నుంచి ఈ ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను తొలగిస్తూ యూజర్లకు షాకిచ్చింది. కాగా, ప్రారంభ ధర రీఛార్జి ప్లాన్ ధరలను సవరించిన ఏడాదికే ఎయిర్‌టెల్‌ ఈ మార్పును చేపట్టడం గమనార్హం. దీంతో పాటు మరో రెండు ప్రీపెయిడ్‌ ప్లాన్లనూ ఎయిర్‌టెల్‌ తొలగించినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Also Read: Devotion : మీరాలం మండిలో మహంకాళికి మహోత్సవం..15 క్వింటాళ్లతో శాకంబరి పూజల వైభవం!

రూ. 579, రూ. 619 ప్లాన్లకు సైతం గుడ్‌బై..

రూ.299 ప్లాన్‌తో 28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు, ఫ్రీ కాలర్‌ ట్యూన్స్‌, పెర్‌ప్లెక్సిటీ ప్రో ఏఐ సబ్‌స్క్రిప్షన్‌ వంటి ప్రయోజనాలు లభించేవి. అయితే, ఈ ప్లాన్‌ తొలగింపుతో ఇకపై, రీఛార్జి చేయాలంటే అందుబాటులో ఉన్న ప్లాన్‌ ఒక్క రూ.349 మాత్రమే. ఈ ప్లాన్‌లో అపరిమిత కాల్స్‌తో పాటు రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. ఇది కూడా 28 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. ఆరు నెలల పాటు యాపిల్‌ మ్యూజిక్‌ సబ్‌స్క్రిప్షన్‌, ఫ్రీ హెలో ట్యూన్స్‌ లభిస్తాయి. ఎంట్రీ లెవల్‌ ప్లాన్‌తో పాటు రూ. 579, రూ. 619 విలువైన రీఛార్జి ప్లాన్లనూ ఎయిర్‌టెల్‌ తొలగించినట్లు సమాచారం. ఈ రెండు ప్లాన్లు కూడా ఎయిర్‌టెల్‌ వెబ్‌సైట్‌లో కనుమరుగయ్యాయి. రూ.579 ప్లాన్‌ 56 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుండగా.. ఇదే డేటా ప్రయోజనాలతో 60 రోజుల వ్యాలిడిటీతో రూ.619 రీఛార్జి ప్లాన్‌ వస్తోంది. అయితే, ప్రస్తుతం ఎంపిక చేసిన కొన్ని సర్కిళ్లలో తొలగించిన ఎయిర్‌టెల్‌.. తర్వాత మిగిలిన సర్కిళ్లలోనూ ఈ రీఛార్జ్‌ ప్లాన్‌ను తొలగించినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News