Saturday, November 15, 2025
Homeబిజినెస్Silver ETF: బంగారం కంటే వెండిలోనే ఎక్కువ రాబడులు

Silver ETF: బంగారం కంటే వెండిలోనే ఎక్కువ రాబడులు

Mutual Funds: ఈ సంవత్సరం వెండి ఆధారిత ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ మార్కెట్ లో  దూసుకెళ్తున్నాయి. బంగారం ఆధారిత ఈటీఎఫ్‌లతో పోలిస్తే వెండి ఈటీఎఫ్‌లు అధిక రాబడులను పెట్టుబడిదారులకు అందించాయి. వెండి ధరలు జీవిత కాల గరిష్టాన్ని తాకడంతో ఈ రంగంలో పెట్టుబడులకు భారీ వృద్ధి కనిపిస్తోంది.

- Advertisement -

2025లో ఇప్పటివరకు వెండి ఈటీఎఫ్‌లు సగటున 31 శాతం రాబడిని అందించాయి. ఈ విభాగంలో 21 ఫండ్స్ 30 నుంచి 32.84 శాతం రాబడి పెరగడంతో ఇన్వెస్టర్లు మేలు పొందారు.

టాప్ సిల్వర్ ఈటీఎఫ్‌లు – రాబడుల వివరాలు: వెండి ధరల్లో నిరంతర పెరుగుదల నేపథ్యంలో ఈటీఎఫ్‌ల పనితీరు అద్భుతంగా నమోదైంది. ప్రధానంగా ఈ క్రింది ఫండ్లు అత్యుత్తమ రాబడులు అందించాయి.

  • యూటీఐ సిల్వర్ ఈటీఎఫ్ – 32.84%

  • అదిత్య బిర్లా ఎస్‌ఎల్ సిల్వర్ ఈటీఎఫ్ – 31.92%

  • యాక్సిస్ సిల్వర్ ఈటీఎఫ్ – 31.87%

  • హెచ్‌డీఎఫ్‌సీ & కోటక్ సిల్వర్ ఈటీఎఫ్‌లు – 31.78%

  • టాటా సిల్వర్ ఈటీఎఫ్ – 30.54%

ఈ ఫండ్లు అన్ని 30 శాతం కంటే అధిక రాబడులను ఇచ్చినట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ద్వారా వెల్లడైంది.

Readmore: https://teluguprabha.net/business/upi-credit-card-and-lpg-rules-changing-from-august-1-2025/

ఈటీ మార్కెట్స్ నివేదిక ప్రకారం, సెప్టెంబర్ వెండి ఫ్యూచర్స్ ఒప్పందాలు కిలోగ్రాముకు రూ. 1,16,275 వద్ద ట్రేడ్ అయి జీవిత కాల గరిష్టాన్ని తాకాయి. గత రోజు కంటే 0.53 శాతం పెరుగుదలను సూచించింది. అంతేకాక, బుధవారం మార్కెట్‌లో వెండి ఈటీఎఫ్‌లు కూడా 1.39 శాతం వరకు లాభపడినట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా చెబుతోంది.

  • యూటీఐ సిల్వర్ ఈటీఎఫ్ – +1.39%

  • మిరాయ్ అసెట్ సిల్వర్ ఈటీఎఫ్ – +1.37%

  • డీఎస్‌పీ సిల్వర్ ఈటీఎఫ్ – +1.05%

అమెరికా వాణిజ్య సుంకాల విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలతో గ్లోబల్ మార్కెట్ లో అస్థిరత ఏర్పడి బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు పెరిగాయి.

2025లో గోల్డ్ ఈటీఎఫ్‌లు సగటున 29.36 శాతం రాబడిని ఇచ్చాయి. గరిష్టంగా 29.81 శాతం రాబడి నమోదు అయింది. ఇది వెండి ఈటీఎఫ్‌ల రాబడితో పోలిస్తే తక్కువగా ఉంది. ఫలితంగా ఇన్వెస్టర్లు ఇప్పుడు వెండి వైపు మొగ్గు చూపుతున్నారు. మొత్తంగా చూస్తే, వెండి ధరల్లో రికార్డు స్థాయి పెరుగుదల, గ్లోబల్ మార్కెట్‌లలో అనిశ్చితి వంటి అంశాలు వెండి ఈటీఎఫ్‌ల ర్యాలీకి బలంగా నిలుస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad