Silver Investment: ఏదాడి కాలంలోనే వెండి రేట్లు భారీగా పెరుగుదలను నమోదు చేశాయి. వాస్తవానికి 2024 ప్రారంభంలో కేజీ వెండి రేటు రూ.80వేల నుంచి రూ.89వేల మధ్య ఉండేది. అయితే అనూహ్యంగా ఒక్కసంవత్సరంలోనే రేట్లలో పెరుగుదల సామాన్యులను షాక్ కి గురిచేసింది. వాస్తవానికి బంగారం తులం రేటు లక్షకు పైనే కొనసాగుతుండగా కనీసం వెండితో చేసిన పట్టీలు, బ్రాల్సెట్, చైన్ వంటి వస్తువులు కొనుకుంటుంటారు మధ్యతరగతి ప్రజలు. అందుకే దానిని పేదల బంగారం అని పిలుస్తుంటారు. కానీ ఏడాది కాలంలోనే వెండి రేటు కేజీ లక్ష 30వేల రూపాయలకు ఎగబాకటం సామాన్యుల మైండ్ పోగొడుతోంది. ఇదే కొనసాగితే భవిష్యత్తులో తాము వెండి ఆభరణాలు కూడా కొనుక్కోలేమని వారు వాపోతున్నారు.
ఇన్నాళ్లుగా లేనిది ఇప్పుడు వెండి రేట్లు పెరగటానికి ఏది కారణంగా మారుతోంది. అసలు ఒక్క సంవత్సరంలో వెండిని ఇంతలా ర్యాలీ చేసేలా ప్రభావితం చేసిన అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పారిశ్రామిక డిమాండ్ పెరగటం:
వెండిని ఇప్పుడు నగలు, నాణేలు మాత్రమే కాకుండా పారిశ్రామికంగా వినియోగించటం కూడా ఎక్కువైంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు(EVలు), సోలార్ ప్యానెల్స్ తయారీతో పాటు షిప్పింగ్ పరిశ్రమలో కూడా విస్తృతంగా వాడటం డిమాండ్ పెరగటానికి కారణంగా మారింది. వీటి ఉత్పత్తి పెరుగుతుండటం కీలకంగా మారింది.
సరఫరా కొరత:
సిల్వర్ మైనింగ్ సమయంలో సహజంగా రాగి, సీసం, జింక్ వంటి ఇతర లోహాల ఉప ఉత్పత్తిగా వస్తాయి. ప్రత్యేకంగా వెండి తవ్వడం తక్కువగా ఉండటం సరఫరా పరిమితమై ఉంది. కొత్త గనులు తవ్వడానికి ఎక్కువ సమయం అవసరం పడటం, ఖర్చులు పెరగడం కూడా సరఫరా తక్కువగా ఉండేందుకు కారణంగా మారాయి.
ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు:
2025లో ప్రధానంగా అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, రష్యా-ఉక్రెయిన్, భారత్-పాకిస్తాన్, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను సురక్షిత ఆస్థిగా గోల్డ్ తో పాటు వెండి వైపు మొగ్గు చూపుతుండటం లోహానికి డిమాండ్ పెంచి రేట్లను ఆకాశానీకి తీసుకెళుతోంది.
Infant Murder: ‘డిప్రెషన్’తో 45 రోజుల పసికందు గొంతు కోసి చంపిన కన్నతల్లి
ద్రవ్యోల్బణంతో హెడ్జింగ్:
ప్రపంచ రాజకీయ భౌగోళిక అనిశ్చితుల వేళ.. భారత్ లో దేశీయ ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండటం, రూపాయి విలువ డాలర్కు నిరంతరం కిందకుపోడం వలన వెండి ద్రవ్యోల్బణం నుంచి రక్షణగా నిలుస్తూ పెట్టుబడిదారులకు ఆకర్షణీయ స్థాయిలో ఉంది. ఇది ఒక హెడ్జ్ ఆస్తిగా మారింది. మార్కెట్లో డిమాండ్ ఉండటంతో చాలా మంది గోల్డ్ కంటే సిల్వర్ రిటర్న్స్ బాగున్నాయని దీనినే హెడ్జింగ్ కోసం ప్రిఫర్ చేస్తున్నారని నిపుణులు అంటున్నారు.
యూఎస్ డాలర్ బలహీనత:
డాలర్ సూచిక 6 వారాల కనిష్ట స్థాయికి పడిపోయినందున వెండి ధరలకు మద్దతు లభించింది. డాలర్ బలహీనత వెండి కొనుగోలును పెంచుతోంది.


