Saturday, November 15, 2025
Homeబిజినెస్SIP: ప్రతిరోజు ఇన్వెస్ట్ చేయటం మంచిదేనా?

SIP: ప్రతిరోజు ఇన్వెస్ట్ చేయటం మంచిదేనా?

 SIP Investment: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ఒక క్రమబద్ధమైన విధానం. దీనిలో ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ పెట్టుబడిదారులకు సంపద సృష్టికి క్రమశిక్షణ, సరళమైన విధానాన్ని అందిస్తున్నాయి. ఇందులో నెలకు రూ.100తో మీ పెట్టుబడిని ప్రారంభించవచ్చు. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టలేని వారికి ఇది ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

- Advertisement -

సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా పెట్టుబడి పెట్టే వారు ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. స్పష్టమైన అవగాహనతోనే ఎస్ఐపీ ప్రారంభించాలి. ఇందులో లాంగ్ టర్మ్స్ లలో మంచి లాభాలు పొందవచ్చు. ఇందులో కాస్త రిస్క్ ఉన్నప్పటికీ దీర్ఘకాలిక వ్యవధిలో పెట్టిన పెట్టుబడికి మంచి రిటర్న్స్ వస్తాయి.

Readmore: https://teluguprabha.net/business/silver-and-gold-rates-in-telugu-and-other-areas/

ఇందులో రోజువారీగా కంటే నెలవారీగా సిప్ చేస్తే అధిక మొత్తంలో లాభం పొందవచ్చు. ఉదాహరణకి ప్రతి రోజు రూ.100 పెట్టడం కంటే.. ప్రతి నెలలో ఒక నిర్ణీత తేదీన ఒకేసారి రూ.3000 పెట్టడం ఉత్తమమైన పద్దతి. ఎందుకంటే ప్రతి నెలలో సాధారణ పని దినాలు 22 రోజులు ఉంటాయి.

ఇలా ప్రతి రోజు రూ.100 ఎస్ఐపీ చేయడం ద్వారా నెలకు రూ.2200 చేస్తారు.  ఇది ఒక 20 ఏళ్ల పాటు చూసుకుంటే పెట్టిన పెట్టుబడితో కలిపి మొత్తం సుమారు రూ.20.23 లక్షలుగా పొందవచ్చు. అలాగే నిర్ణీత తేదీలో ప్రతి నెల ఒకేసారి రూ. 3000 ఎస్ఐపీ చేయటం ద్వారా అదే 20 ఏళ్లలో రూ.27.59 లక్షలు పొందవచ్చు.

Readmore: https://teluguprabha.net/business/jio-free-hotstar-fiber-offer-2025/

ఇక్కడ ఒకటి చూసుకుంటే రెండింటికి కూడా ఒకటే వడ్డీ, ఒకటే కాలం.. కానీ రెండింటి మధ్య వ్యత్యాసం మాత్రం వేరువేరుగా ఉంది. ఎస్ఐపీ పథకాన్ని ఎంచుకునే ముందు  భవిష్యత్తు లక్ష్యాలను అంచనా వేసుకుని ప్రారంభించాలి. ఎప్పటికప్పుడు మ్యూచువల్ ఫండ్స్ పనితీరును గమనిస్తూ ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుల సలహా ఆధారంగా పెట్టుబడి చేస్తే మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad