Tax Filing 2025: సెప్టెంబర్ 15తో AY 2025–26 కోసం ఆదాయపన్ను రిటర్న్స్(ITR) దాఖలు చేసే గడువు ముగిసిపోనుంది. ఈ క్రమంలో వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల కంటే తక్కువ ఉన్నవారు తమకు ITR ఫైల్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. అయితే గత ఏడాది కింద పేర్కొన్న ట్రాన్సాక్షన్స్‌లో ఏ ఒక్కటి మీరు నిర్వహించినా ఆదాయంతో సంబంధం లేకుండా ఐటీఆర్ తప్పకుండా ఫైల్ చేయాల్సిందేనని పన్ను చట్టాలు చెబుతున్నాయి. అంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆదాయం తక్కువైనా ITR ఫైల్ చేయడం తప్పనిసరి అవుతుంది.
ఏ ట్రాన్సాక్షన్స్ చేస్తే తప్పకుండా ఐటీఆర్ ఫైల్ చేయాలనే వివరాలు..
1. కరెంట్ అకౌంట్‌లో ఏడాదిలో రూ.1 కోటి కంటే ఎక్కువ డిపాజిట్ చేసినప్పుడు.
2. ఏడాదిలో సేవింగ్స్ అకౌంట్‌లో రూ.50 లక్షలకు మించి నగదు జమ చేసినా.
3. వార్షికంగా వ్యాపార టర్నోవర్ రూ.60 లక్షలు దాటినప్పుడు.
4. వార్షిక ప్రొఫెషనల్ ఆదాయం రూ.10 లక్షలు దాటితే.
5. ఏడాదిలో విదేశీ ప్రయాణాల ఖర్చులు రూ.2 లక్షలు మించినప్పుడు.
6. ఏడాదిలో కరెంట్ బిల్లులు రూ.లక్ష కంటే ఎక్కువగా చెల్లించినప్పుడు.
7. ఆర్థిక సంవత్సరంలో TDS లేదా TCS మొత్తం రూ.25,000 (సీనియర్ సిటిజన్లకు రూ.50,000) మించి కట్ అయినప్పుడు.
8. విదేశీ ఆస్తులు, ఆదాయం లేదా బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నవారు.
పరిమితులు మించకపోయినా ITR ఫైల్ చేయాల్సిన సందర్భాలు:
1. TDS రీఫండ్ క్లెయిమ్ చేసుకోవడానికి.
2. లోన్/వీసా కోసం దరఖాస్తు చేసినప్పుడు ఆదాయ రుజువు చూపడానికి.
3. క్యాపిటల్ లాసెస్ తర్వాతి ఆర్థిక సంవత్సరాలకు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవటానికి.
4. ఫైనాన్షియల్ క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకోవటానికి.
5. భవిష్యత్తులో ఆర్థిక సంస్థల నుంచి రుణాలను పొందటం కోసం ITR ఫైలింగ్ మంచిదే.
అసలు ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయటానికి ఆదాయ లిమిట్ ఎంత..
* పాత పన్ను విధానం (Old Tax Regime): వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల లోపు ఉన్నవారికి ITR ఫైల్ చేయాల్సిన అవసరం లేదు.
* కొత్త పన్ను విధానం (New Tax Regime): ప్రాథమిక మినహాయింపు రూ.3 లక్షలకు పెంచారు. ఈ పరిమితి కింద వచ్చే ఆదాయం కలిగిన వ్యక్తులు ITR ఫైలింగ్ నుంచి మినహాయింపుకు అర్హులు.


