Small Car: ఈ ఇంటర్నెట్ యుగంలో ఏమైనా చేస్తే ఇట్టే వైరల్ అవుతోంది. వింత ఆవిష్కరణలు, సరికొత్త విజువల్స్ ఇంటర్‌నెట్‌ని షేక్ చేస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ సరికొత్త ఆవిష్కరణ తెగ వైరల్ అవుతోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారుగా ప్రచారం అవుతున్న ఆ వాహనం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకు కారణంగా దానిని ఎలా డ్రైవ్ చేస్తారనేదే ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ సరికొత్త డిజైన్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఇది ఇంటర్‌నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ కారు ఓనర్ ఒక ఇటలీకి చెందిన ఓ కారు ఓనర్ తాను మోడిఫై చేసిన ఇది అచ్చం బొమ్మకారు వలె ఉంటుంది. ఈ కారును అతను అతను డ్రైవ్ చేస్తున్న వీడియో సైతం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ కారు నాలుగు చక్రాలు కారు డిజైన్ ప్రకారం మోడిఫై చేశారు. దీంతో ఇది ప్రపంచంలోనే అతి సన్నని కారుగా కనిపిస్తోంది. అంతే కాకుండా రోడ్డుపై వెళ్లేవారి దృష్టినీ ఈ కారు ఇట్టే ఆకర్షిస్తోంది.
దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన వెంటనే నెటిజన్ల విపరీతమైన స్పందన వచ్చింది. ఈ వినూత్న కారుని చాలామంది ప్రశంసిస్తున్నారు. అయితే మరికొందరు హై స్పీడ్‌లో ఉన్నప్పుడు మూల మలుపుల వద్ద ఈ కారు ఎలా ఉంటుందో అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది నెటిజన్లు ఈ వింత కారుపై తమదైన శైలిలో కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. కొందరు “ఈ కారు కచ్చితంగా బడ్జెట్‌లోనే అందుబాటులోకి రావాలని కామెంట్ చేస్తున్నారు.
చాలా మందికి, కారు అనేది కేవలం రవాణా సాధనం మాత్రమే కాదని అదొ ఎమోషన్‌గా కూడా ఉంటుంది. దీనికి నిదర్శనమే గుజరాత్‌లోని ఓ కుటుంబం తమ 12 ఏళ్ల వాగన్‌ఆర్‌కు గత ఏడాది అంతిమ సంస్కారాలతో వీడ్కోలు పలికింది. ఈ సంఘటన ఇంటర్‌నెట్‌ని షేక్ చేసింది. దీనిపై వారిని పలకరించగా.. ఈ కారు తమకు అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని ఓనర్ చెప్పారు. దీంతో కారుని ఖననం చేసేందుకు దాదాపు రు. 4 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపారు. అంతే కాదు సుమారు 1,500 పైగా మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆచార, సంప్రదాయాల ప్రకారం కారుని పూడ్చిపెట్టారు. దాదాపు 15 అడుగుల లోతు గుంతలో కారును ఖననం చేశారు. బంతిపూల దండలు, గులాబీ రేకులతో అలంకరించిన ఈ దృశ్యం ఇంటర్‌నెట్‌ని ఊపేసింది. కొంతమంది జనాలు కారు మోడిఫికేషన్స్, ప్రయోగాలు చేస్తూనే ఉంటారు.