Tax Notice: ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్ సమీపంలో ఉన్న ఖుర్జా నగరంలోని సుభీర్ అనే ఓ చిన్న కిరాణా షాప్ యజమాని. అయితే ఆదాయపు పన్ను అధికారులు పంపించిన ఒక నోటీసు ఆయనకు గుండెపోటు వచ్చేంత పని చేసింది. వాస్తవానికి సదరు వ్యాపారి పాన్ కార్డు దుర్వినియోగం అయ్యి అతనికి తెలియకుండానే.. చిరు వ్యాపారి పేరు మీద ఏకంగా 6 కంపెనీలు ఢిల్లీలో వెలిసాయి. ఈ కంపెనీల విక్రయాలపై రూ.141 కోట్లకు సంబంధించిన ఆదాయపు పన్ను నోటీసులు తనకు రావటంతో ఒక్కసారిగా ఖంగుతిన్నాడు సదరు వ్యాపారి.
Revanth reddy : అమరావతి పెద్ద గుదిబండ.. ఏపీ రాజధనిపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్
సుభీర్ వృత్తిగతంగా నెలకు కేవలం రూ.10 నుంచి రూ.12వేలు సంపాదించే చిన్న వ్యాపారి. 2022లో అతడికి మొదటి పన్ను నోటీసు వచ్చింది. ఆ సమయంలోనే అతను పన్ను అధికారులకు సహాయంగా తనకు సంబంధం లేని వ్యవహారాలు, కంపెనీలు గురించి వివరించాడు. కానీ 2025 జూలై 10న మరోసారి ఇదే తరహా నోటీసులు రావటంతో షాక్ అయ్యాడు. ఈ సారి ఏకంగా రూ.141 కోట్ల వ్యాపారం జరిగిందంటూ అధికారులు పంపిన నోటీసులో చూసి షాకయ్యాడు.
సుభీర్ చెబుతున్నది నిజమేనా.. నేరగాళ్లతో అతనికి పరిచయాలు ఉన్నాయా, వారికి ఏమైనా సహకారం అందిస్తున్నాడా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటివరకు 6 కంపెనీలపై అధికారులు కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి, పాన్ దుర్వినియోగం జరగడానికి కారణాలు, అవినీతికి పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
పాన్ కార్డు దుర్వినియోగం అంటే అప్పులు తీసుకోవడం, షెల్ కంపెనీలు స్థాపించడం, పన్ను తప్పించుకోవడం వంటివి చిక్కులు తెచ్చిపెడతాయి. అందుకే రెగ్యులర్‌గా క్రెడిట్ రిపోర్ట్లు పరిశీలించడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి సంఘటనలు సహజంగా చిన్న వ్యాపారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.


