Saturday, November 15, 2025
Homeబిజినెస్Zoho Job Offer: గణిత నైపుణ్యాలు ఉన్నవారికి జోహోలో ఉద్యోగ అవకాశం: శ్రీధర్ వెంబు

Zoho Job Offer: గణిత నైపుణ్యాలు ఉన్నవారికి జోహోలో ఉద్యోగ అవకాశం: శ్రీధర్ వెంబు

Sridhar Vembu: ప్రస్తుతం రోజూ వార్తల్లో నిలుస్తోంది జోహో కంపెనీ. ప్రపంచ దిగ్గజ సంస్థలపై ఆధారపడటాన్ని తగ్గించుకుని దేశీయ సాంకేతిక విప్లవానికి సమయం అయ్యిందని జోహో ఉత్పత్తులపై వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రధానంగా అరట్టాయ్, జోహో మెయిల్, జోహో సెర్చ్ బ్రౌజర్, జోహో పే వంటి అనేక ఉత్పత్తులపై విస్తృతంగా చర్చ కొనసాగుతున్న వేళ జోహో కంపెనీలో ఉద్యోగానికి ఆ ఒక్క పరిజ్ఞానం ఉంటే సరిపోతుందనే వార్త సంచలనంగా మారింది.

- Advertisement -

వివరాల్లోకి వెళితే జోహో కంపెనీ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు మేథమెటికల్ స్కిల్స్ ఉన్న ప్రతిభావంతులైన అభ్యర్థులను స్వయంగా సంప్రదించాలని ఆహ్వానం ఇచ్చిన విషయం వార్తల్లో వచ్చింది. కంపెనీ సీఈవో పదవికి రాజీనామా చేసిన తర్వాత చీఫ్ సైంటిస్ట్ గా మారిన శ్రీధర్ వెంబు.. గణిత శాస్త్రం, ఆల్గోరిథమ్స్ లో పట్టు ఉన్న వ్యక్తులను జోహోలో ముఖ్యమైన పరిశోధన, అభివృద్ధి విభాగాలకు ఆహ్వానిస్తున్నారు. జోహో మెయిల్ సరికొత్త టెక్నాలజీతో స్పామ్, ఫిషింగ్ నిరోధంలో అత్యుత్తమ పనితీరు సాధించినదిగా చెబుతోంది. ఈ నియామకాలు కంపెనీని క్లౌడ్ సాఫ్ట్ వేర్ విభాగాన్ని మరింత బలపరిచేందుకు తోడ్పడనుందని తెలుస్తోంది.

శ్రీధర్ వెంబు తమిళనాడు తంజావూరు జిల్లాలో జన్మించి, IIT మద్రాస్, ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుంచి విద్య పూర్తి చేసిన ప్రతిభావానవారు. ఆయన సెప్టెంబర్ 2025లో CEO పదవిని రాజీనామా చేయడం, R&Dలో తన పూర్తి దృష్టిని పెట్టేందుకు నిర్ణయం తర్వాత కంపెనీ కొత్త పుంతలు తొక్కుతోంది. జోహో సంస్థ ప్రస్తుతం అత్యధికంగా ఆలోచన శక్తి, గణిత నైపుణ్యాల పైన ఆధారపడి ఉంది. శ్రీధర్ వెంబు సాంకేతిక అభివృద్ధికి గణితం అనివార్యమని విశ్వసిస్తూ.. అద్భుతమైన పనితీరుతో జోహోను ప్రపంచ మార్కెట్లో నిలిపారు.

కొత్త నియామకాల ద్వారా జోహో భారతీయ టెక్నాలజీ రంగంలో కొత్త శైలిని ప్రవేశపెట్టనుందని గణిత నైపుణ్యాలు ఉండేవారిని మాత్రమే కాకుండా సాంకేతిక విజ్ఞానంతో సమృద్ధి గల అభ్యర్థులను లక్ష్యంగా పెట్టుకుని మరింత అభివృద్ధి సాధించాలని చూస్తోంది. దీంతో సంస్థలో కొత్త సాంకేతికతలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక టెక్నాలజీల్లో వేగంగా ముందుకు సాగేందుకు మేథమెటిక్స్ పై పట్టు ఉన్న నిపుణులు కావాలని భావిస్తోంది. ఇది ఏఐ కంప్యూటింగ్ వ్యవస్థలను మరింత సమస్థవంతంగా మారుస్తుందని ఆయన నమ్ముతున్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad