Saturday, November 15, 2025
Homeబిజినెస్SC/ST Women Loan : రూ.10 లక్షల లోన్..వెంటనే అప్లై చేయండి

SC/ST Women Loan : రూ.10 లక్షల లోన్..వెంటనే అప్లై చేయండి

Stand Up India Scheme: షెడ్యూల్డ్ కులాలు (SC) , షెడ్యూల్డ్ తెగలకు (ST) చెందిన మహిళా పారిశ్రామికవేత్తల ఆర్థిక స్వాలంబన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకమే స్టాండప్ ఇండియా. 2016 ఏప్రిల్ 5న ప్రారంభించిన ఈ పథకం, చిన్న మరియు మధ్య స్థాయి పరిశ్రమలు (SMEs) ఏర్పాటు చేసుకునే వారికి లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారికి ఒక గొప్ప వరం.

- Advertisement -

భారీ రుణాలు, సులభంగా:
ఈ పథకం ద్వారా మీరు రూ. 10 లక్షల నుండి రూ. 1 కోటి వరకు రుణం పొందవచ్చు. మీ వ్యాపారం కోసం అవసరమయ్యే పెట్టుబడిలో కేవలం 10% నుండి 15% మీరు సమకూర్చుకుంటే చాలు, మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల ద్వారా లోన్ రూపంలో పొందే అవకాశం ఉంది. ఈ పథకం అమలు కోసం పార్లమెంటులో రూ. 62,791 కోట్లు మంజూరు చేయబడింది.ప్రతి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ బ్రాంచ్ కనీసం ఒక SC/ST మహిళకు రుణం మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

అర్హతలు
వయస్సు: అప్లై చేసుకునేవారికి కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి.

వాటా: భాగస్వామ్య వ్యాపారమైతే, లోన్ పొందే SC/ST మహిళ పేరు మీద వ్యాపారంలో కనీసం 51% వాటా ఉండాలి.

ఆర్థిక చరిత్ర: దరఖాస్తుదారుకు మంచి సిబిల్ స్కోర్ ఉండాలి మరియు గతంలో ఎలాంటి లోన్ డీఫాల్టర్‌గా ఉండకూడదు.

తిరిగి చెల్లింపు: తీసుకున్న లోన్‌ను 18 నెలల నుండి 7 సంవత్సరాల లోపు తిరిగి చెల్లించే సౌలభ్యం ఉంటుంది.

సొంతంగా వ్యాపారం చేయాలనే కసి ఉన్నవారు, అధిక వడ్డీలకు బయట అప్పులు చేయకుండా ఈ అద్భుతమైన ప్రభుత్వ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి, https://www.standupmitra.in/ అనే వెబ్‌సైట్‌ను సందర్శించండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad