- Advertisement -
మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 317 పాయింట్లు వద్దకు చేరగా.. మొత్తంగా 82,570కి లాభపడింది. మరోవైపు నిఫ్టీలోనూ 113 పాయింట్లు పెరిగి 25,195 వద్ద స్థిరంగా కొనసాగింది. ఇదిలా ఉండగా.. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ రూ. 85.82గా ఉంది.
బీఎస్ఈ సెన్సెక్స్ లో ప్రధానంగా బజాన్ ఫిన్ సర్వ్, సన్ ఫార్మా, టాటా మోటార్స్, మహీంద్రా తదితర షేర్లు మరింతగా రాణించాయి. ఎటర్నల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్ తో పాటు అనేక షేర్లు నష్టాల్లో ముగిశాయి.


