Stock markets end with heavy losses: గత నాలుగు రోజులుగా రయ్‌మంటూ దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో పాటు ఎఫ్‌ఎంసీజీ, బ్యాంక్, రియాల్టీ స్టాక్స్‌లో అమ్మకాల జోరు కనిపించింది. సూచీలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. దీంతో, వరుసగా నాలుగు రోజుల సూచీల లాభాలకు బ్రేక్ పడింది. ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన నిర్ణయాలు బుధవారం వెలువడనుండడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు.
Also Read: Welfare : ప్రజా సమస్యల పరిష్కారంలో మీడియా ఐక్యంగా ముందుండాలి: ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్
95.37 వద్ద ట్రేడ్ అవుతోన్న రూపాయి విలువ..
సెన్సెక్స్ 210.08 పాయింట్లు క్షీణించి 78,428.95 వద్ద ముగియగా.. నిఫ్టీ 159.40 పాయింట్లు పతనమై 24,614.90 వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.37 వద్ద స్థిరపడింది. ఇక, సెన్సెక్స్ 30 విషయానికి వస్తే.. హిందుస్థాన్ యునిలీవర్ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎన్‌టీపీసీ, రిలయన్స్, ఇండిగో, టెక్‌మహీంద్రా స్టాక్స్ భారీగా నష్టపోయాయి. వీటిలో ఇన్వెస్ట్ చేసిన మదుపర్లు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. ఇక, ట్రెంట్, బజాజ్ ఫైనాన్స్, బీఈఎల్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్ లిమిటెడ్ షేర్లు భారీగా లాభపడ్డాయి. కాగా, ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 85.58 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ఔన్స్ ధర 4,047.14 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

