Saturday, November 15, 2025
Homeబిజినెస్Sugar Stocks Rally: మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. దూసుకుపోతున్న షుగర్ స్టాక్స్.. ఫుల్ లిస్ట్...

Sugar Stocks Rally: మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. దూసుకుపోతున్న షుగర్ స్టాక్స్.. ఫుల్ లిస్ట్ ఇదే..

Sugar Stocks: భారత ప్రభుత్వం ఇటీవల ఇథనాల్ ఉత్పత్తిపై పరిమితులు తొలగించడంతో షుగర్ స్టాక్స్ ఒక్కసారిగా పెరగటం ప్రారంభించాయి. ట్రేడింగ్‌లో కొన్ని షుగర్ కంపెనీల షేర్లు నేడు ఇంట్రాడేలో ఏకంగా 12% వరకు పెరుగుదలను చూశాయి. భారత ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి షుగర్‌కేన్ జ్యూస్, షుగర్ సిరప్, అన్ని రకాల మోలాసెస్ ద్వారా ఇథనాల్ ఉత్పత్తిలో పరిమితులను తొలగించటంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా షుగర్ స్టాక్స్ కొనేందుకు ఎగబడుతున్నారు. మోదీ సర్కార్ నిర్ణయం వల్ల కంపెనీలకు అధిక లాభాలు, షుగర్ పరిశ్రమకు కొత్త అవకాశాలు రావటమే ప్రధాన ప్రేరకంగా ఉంది.

- Advertisement -

గత ఏడాది షుగర్‌పైన పరిమితులు ఉండగా 2025-26లో షుగర్‌కేన్, మోలాసెస్, సిరప్ ద్వారా ఇథనాల్ తయారీకి లిమిట్స్ తొలగించబడ్డాయి. ప్రస్తుతం భారత ప్రభుత్వం పెట్రోలులో ఇథనాల్ 20% బ్లెండింగ్ కోసం లక్ష్యాలను 2025-26 నాటికి సాధించేందుకు కొత్త నిర్ణయం సహాయపడనుంది.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇవాళ లాభపడుతున్న షుగర్ స్టాక్స్ వివరాలు..
* Balrampur Chini Mills: 7% పెరిగింది.
* Shree Renuka Sugars: 12% పెరిగింది.
* Uttam Sugar Mills: 12% పెరిగింది.
* Dhampur Sugar Mills, Magadh Sugar & Energy: సుమారు 10% పెరిగాయి.
* Bajaj Hindusthan Sugar, Godavari * Biorefineries: 8% వరకు పెరిగాయి.
* Triveni Engineering, Dwarikesh Sugar: 4-5% పెరిగాయి.
* Praj Industries: 6% పెరిగింది
* ఇథనాల్ తయరీలో ఉపయోగించే ప్లాంట్లు, ఎక్విప్మెంట్ తయారు చేసే ప్రాప్ ఇండస్ట్రీస్ స్టాక్ కూడా లాభపడింది.

ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్, గ్రీన్ ఎనర్జీ ప్రోత్సహం వంటి చర్యలు భారతదేశం విదేశీ చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని కూడా తగ్గిస్తుంది. దీంతో దేశీయ ఇన్వెస్టర్లు ఈ పరిశ్రమలో లాభపడే కంపెనీలపై దృష్టి సారిస్తున్నారు. గణనీయమైన షేర్ ర్యాలీతో పాటు ప్రభుత్వ మద్దతు ఉన్న కంపెనీలు దీర్ఘకాలంలో మంచి లాభాలను అందించగలవని చాలా మంది రిటైలర్లు నమ్ముతూ బెట్టింగ్ వేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad