Swiggy New App Toing: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ.. ‘టోయింగ్’ పేరుతో మరో ప్రత్యేక డెలివరీ యాప్‌ను ప్రారంభించింది. మహారాష్ట్రలోని పుణేలో ఈ కొత్త డెలివరీ యాప్‌ను లాంచ్ చేసింది. విద్యార్థులు, యువత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను దృష్టిలో పెట్టుకున్న సంస్థ.. ఈ యాప్ ద్వారా రూ.100-150కే మీల్స్ అందించనున్నట్లు తెలిపింది. ఈమేరకు కస్టమర్ల నుంచి సర్జ్ ఫీజు వసూలు చేయడం లేదని కంపెనీ వెల్లడించింది.
పుణేలో విద్యార్థులు, యువ ఉద్యోగులు ఎక్కువగా ఉండటంతో స్విగ్గీ తన కొత్త యాప్ టోయింగ్‌ను ప్రారంభించేందుకు పుణెను ఎంచుకుంది. తర్వాత ఇతర నగరాలకు విస్తరించే యోచనలో ఉంది. సాధారణంగా స్విగ్గీ తన కొత్త ప్రయోగాలను బెంగళూరులో మొదలుపెడుతుంది. అయితే పుణెలో విద్యార్థులు, తక్కువ ఆదాయం సంపాదించే ఉద్యోగులు ఎక్కువగా బయట ఆర్డర్ చేసుకోవడాన్ని కంపెనీ అంచనా వేసింది. దీంతో ‘టోయింగ్’ లాంచ్‌కు పుణెను ఎంచుకుంది. కాగా, బెంగళూరు మార్కెట్ ఇప్పటికే ప్రబలంగా ఉండటంతో పుణెలో కొత్త అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కంపెనీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Also Read: https://teluguprabha.net/business/maruti-suzuki-car-prices/
ఈ క్రమంలో స్విగ్గీ ‘టోయింగ్’ రూ. 99 స్టోర్, Snacc వంటి ఇతర యాప్‌లతో భిన్నంగా ఉంటుందని సంస్థ చెబుతోంది. Snacc క్యాంటీన్ ఆహారంపై ఫోకస్ చేస్తే, టోయింగ్ మాత్రం రూ.100-150 పరిధిలో ఉన్న తినుబండారాలను అందించనున్నట్లు తెలిపింది. పెద్ద మొత్తంలో ఆఫర్‌లను కలిగి ఉండి ప్రత్యేకంగా తక్కువ ఖర్చుతో భోజనం కోరుకునే వారిపైనే స్విగ్గీ దృష్టి పెడుతూ ‘టోయింగ్’ను తీసుకొచ్చినట్లు పేర్కొంది.
టోయింగ్ యాప్ డిజైన్‌లో పింక్, గ్రీన్ కలర్ థీమ్‌ను ఉపయోగించారు. టోయింగ్‌తో కలిపి ఇప్పుడు స్విగ్గీకి ఇన్‌స్టామార్ట్, పింగ్, డైనవిట్, క్రూ, స్నాక్ యాప్‌లు ఉన్నాయి. సూపర్ బ్రాండ్స్ మోడల్ దిశగా సంస్థ దూసుకుపోతోంది. కాగా, క్యాబ్ సర్వీసులు అందిస్తున్న ర్యాపిడో ‘ఓన్‌లీ’ పేరిట ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం బెంగళూరులో సేవలు అందిస్తుండగా.. స్విగ్గీ, జొమాటోపై ఆధిపత్యం కొనసాగించేందుకు జీరో కమీషన్ మోడల్ కాన్సెప్ట్‌తో ముందుకొస్తోంది.
స్విగ్గీ ఫుడ్ డెలివరీ ప్రస్తుతం నెలకు 16.3 మిలియన్ వినియోగదారులకు తమ సేవలను అందిస్తోంది. ‘స్విగ్గీ’ ప్రత్యేక యాప్‌ల ద్వారా.. ప్రతి వ్యాపార విభాగానికి ప్రత్యేకంగా పని చేస్తోంది. ఈ నేపథ్యంలో టోయింగ్ ద్వారా మార్కెట్‌లో తక్కువ బడ్జెట్ వర్గానికి చేరుకోవడం, పెట్టుబడిదారులకు ప్రయోజనాలు కల్పించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.


