Wednesday, January 14, 2026
Homeబిజినెస్Swiggy Report: హైదరాబాదీల ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ ఫుడ్‌గా బిర్యాని.. స్విగ్గీ షాకింగ్‌ రిపోర్ట్‌

Swiggy Report: హైదరాబాదీల ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ ఫుడ్‌గా బిర్యాని.. స్విగ్గీ షాకింగ్‌ రిపోర్ట్‌

Swiggy Report on Favourate Food: బిర్యానీ అనగానే వెంటనే గుర్తుకొచ్చేది హైదరాబాదే. మరి, బిర్యానీని ఇష్టపడని వారు ఉండరు. అందుకే, హైదరాబాదీల ఆల్‌టైమ్‌ ఫేవరేట్‌ ఫుడ్‌గా దూసుకుపోతోంది బిర్యానీ. తాజాగా ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ చేసిన సర్వేలోనూ ఇదే తేలింది. హైదరాబాదీలు బుక్‌ చేసుకునే ఫుడ్‌లో బిర్యానీ టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. హైదరాబాదీలు బిర్యానీని ఎంతగా ఇష్టపడుతున్నారంటే.. డే టైమ్‌లోనే కాదు రాత్రి 12 నుంచి 2 గంటల వరకు కూడా కస్టమర్లు ఆర్డర్‌ చేస్తున్నారని స్విగ్గి స్పష్టం చేసింది.

- Advertisement -

బిర్యానీ అంటే ఒక ఎమోషన్‌..

హైదరాబాదీలకు బిర్యానీ అంటే ఫుడ్ కాదు.. ఒక ఎమోషన్. అందుకే, బయట ఫుడ్ అనగానే బిర్యానీకే ప్రాధాన్యం ఇస్తారు. ఫుడ్ డెలివరి సంస్థ స్విగ్ ఇటీవల విడుదల చేసిన 2025 డేటాను చూస్తే.. మనోళ్లకు బిర్యానీ అంటే ఎంత ప్రేమో అర్థమైపోతుంది. 2025లో హైదరాబాదులో సుమారు 175 లక్షల ప్లేట్ల బిర్యానీ ఆర్డర్లు స్విగ్గీకి వచ్చాయట. ఇందులో 108 లక్షల ఆర్టర్లు చికెన్ బిర్యానీలే ఉన్నాయట. ఇక, బిర్యానీ తర్వాత హైదరాబాదీయులు ఎక్కువ ప్రాధాన్యమిచ్చిన ఫుడ్ వెజ్ దోశ, ఇడ్లీ. స్విగ్గీ ద్వారా 39.9 లక్షల మంది వెజ్ దోశను ఆర్డర్ పెట్టారట. 34 లక్షల ఆర్డర్లలతో ఇడ్లీ మూడో స్థానంలో ఉందట. 18.1 లక్షల మంది వెజ్ వడా ఆర్డర్ చేయగా, దాదాపు 22.13 లక్షల మంది హైప్రోటీన్ ఆర్డర్స్ పెట్టారట. ఈవినింగ్ స్నాక్స్ కింద అంటే డైలీ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 6.8 లక్షల మంది చికెన్ బర్గర్లు, 5.9 లక్షల మంది చికెన్ ఫ్రై ఆర్డర్లు పెట్టారట. చికెన్ షవర్మ, వెజ్ పిజ్జా, వెజ్ పఫ్ ఉన్నాయని స్విగ్గీ డేటాలో తేలింది.

అర్ధరాత్రి దాటినా ఆగని ఆర్డర్లు..

కొంతమంది పగలు కంటే రాత్రిళ్లు ఎక్కువగా ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తుంటారు. అందుకే ఆ టైమ్‌లోనే బిర్యానీ ఆర్డర్లు ఎక్కువగా జరుగుతున్నాయి. స్విగ్గి లెక్కల ప్రకారం.. అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు సుమారు 6 లక్షల మంది చికెన్ బిర్యనీలు ఆర్డర్లు పెట్టారని తేలింది. కొందరు చికెన్ బర్గర్లు కూడా ఆర్డర్ పెట్టారని స్విగ్గి డేటాను బట్టి తెలుస్తోంది. ఆ టైమ్‌లో స్వీట్లు, కేకులు ఆర్డర్ పెట్టేవారు కూడా బాగానే ఉన్నారని తేలింది. 3.3 లక్షల మంది బూందీ లడ్డులు, చాక్లెట్లు, గులాబ్ జామ్‌లు ఆర్డర్ చేశారని స్విగ్గీ స్పష్టం చేసింది.

ఉత్తరాది రుచులకూ డిమాండ్..

హైదరాబాద్‌లో కేవలం తెలంగాణ రుచులే కాదట.. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు రుచులకు కూడా బాగా డిమాండ్ ఉందని తేలింది. గతంలో కంటే ఆ రాష్ట్రాల సాంప్రదాయ వంటకాల డిమాండ్ 20 శాతానికి పెరిగిందని స్విగ్గి విడుదల చేసిన డేటాను బట్టి తెలుస్తోంది. అంతేకాదు, ఉత్తరాది, బెంగాలీ ఫుడ్స్‌ను కూడా మనోళ్లు వదలట్లేదని స్విగ్గి వెల్లడించింది. గతంతో పోల్చితే వీటి ఆర్డర్ల సంఖ్య సుమారు 14 శాతానికి పెరిగిందని డేటాను బట్టి తెలుస్తోంది. ఇక, స్విగ్గి రిపోర్టులో ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే.. ఒకే ఒక్క కస్టమర్.. 10 అపోలో ఫిష్, 11 పుట్ట గొడుగుల వేపుడు, 13 కాజు కోడి రోస్ట్, 42 ప్లేట్ల బిర్యానీలు ఆర్డర్ పెట్టాడని స్విగ్గి ఫుడ్ మార్కెట్ ప్లేస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సిద్ధర్థ్ భాకో వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News