T20 World Cup: టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ సాధించిన భారీ విజయం బ్రాడ్‌కాస్టర్లకు కాసుల వర్షం కురిపించింది. ఈ మెగా ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసిన జియోస్టార్(JioStar).. ప్రకటనల కోసం కళ్లు చెదిరే ధరలను వసూలు చేసినట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.
పోటీ పడ్డ బ్రాండ్లు.. రికార్డు స్థాయిలో ధరలు!: ఫైనల్ మ్యాచ్‌కు ఉన్న విపరీతమైన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని కేవలం 10 సెకన్ల కమర్షియల్ యాడ్ కోసం ఏకంగా రూ. 50 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. యాడ్స్ కోసం కేటాయించిన సమయం తక్కువగా ఉండటంతో.. టాప్ బ్రాండ్లు పోటీపడి మరీ ప్రీమియం ధరలు చెల్లించడానికి సిద్ధపడ్డాయి. కన్స్యూమర్ గూడ్స్ , టెక్నాలజీ మరియు ఆటోమొబైల్ రంగాలకు చెందిన కంపెనీలు ఈ రేసులో ముందున్నాయి.
Also read-T20 World Cup: మిడిలార్డర్ వెన్నెముక తిలక్.. అంకితభావానికి నిదర్శనం సిరాజ్!
వ్యూవర్‌షిప్ రికార్డులే కీలకం!: ఇటీవల భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌కు వచ్చిన స్పందనే ఈ భారీ ధరలకు ప్రధాన కారణం. సెమీఫైనల్ సమయంలో జియో హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లో ఏకంగా 6.52 కోట్ల మంది లైవ్ వీక్షించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా లైవ్ ఈవెంట్ స్ట్రీమింగ్‌లో ఒక రికార్డు. టీవీలతో పోలిస్తే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కోట్లాది మంది వినియోగదారులను చేరుకోవచ్చని కంపెనీలు భావించడంతో ఫైనల్ మ్యాచ్ యాడ్ స్లాట్‌లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. మొత్తానికి టీమిండియా ప్రపంచకప్‌ను గెలిస్తే.. బ్రాడ్‌కాస్టర్లు మరియు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు ఆదాయంలో కొత్త రికార్డులు సృష్టించాయి.

