HomeTop StoriesTata Tiago Cars: టాటా నుంచి మిడిల్ క్లాస్ కారు.. కేవలం రూ. 5 లక్షల్లోపే...

Tata Tiago Cars: టాటా నుంచి మిడిల్ క్లాస్ కారు.. కేవలం రూ. 5 లక్షల్లోపే అధిరిపోయే ఫీచర్లతో లాంచ్..!

Tata New EV Cars Launch: దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్‌ నెక్ట్స్‌ జనరేషన్‌ టియాగో, టియాగో ఈవీ కార్లను మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. మిడిల్ క్లాస్ ను దృష్టిలో పెట్టుకొని ఈ ఎంట్రీ లెవల్‌ హ్యాచ్‌బ్యాక్‌ ధరను రూ. 4.69 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌) నిర్ణయించింది. ఎలక్ట్రిక్‌ వెహికల్‌ ధరను రూ.6.99 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌)గా పేర్కొంది. ఇదే, టియాగో ఈవీని బ్యాటరీ అద్దె ప్రాతిపదికన (బ్యాటరీ యాజ్‌ ఏ సర్వీస్‌) తీసుకుంటే రూ.4.69 లక్షలతో పాటు కిలోమీటరుకు రూ.2.6 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఐసీఎన్‌జీ వెర్షన్‌ ధరను రూ.5.79 లక్షలుగా (ఎక్స్‌ షోరూమ్‌) కంపెనీ నిర్ణయించింది.

- Advertisement -

Also read: BJP New Presidents: బీజేపీ సంచలన నిర్ణయం.. ఒకేసారి నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు.. తెలంగాణ కూడానా?

స్విఫ్ట్‌, గ్రాండ్‌ ఐ10 నియోస్‌లకు గట్టిపోటీ..

కొత్త టియాగోలో డిజైన్‌, ఇంటీరియర్‌, ఫీచర్‌ పరంగా చాలా వరకు మార్పులు చేపట్టారు. మారుతీ సుజుకీ స్విఫ్ట్‌, హ్యుందాయ్‌ గ్రాండ్‌ ఐ10 నియోస్‌ వంటి మోడళ్లకు పోటీ ఇచ్చేలా అవసరమైన అన్ని మార్పులు చేశారు. ఐ బ్రో స్టైల్‌ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌, డీఆర్‌ఎల్స్‌ వంటివి అమర్చారు. దీని వెనుక వైపు కూడా ఎల్‌ఈడీ టెయిల్‌లైట్స్‌ అందించింది. 15 అంగుళాల డ్యూయల్‌ టోన్‌ అల్లాయ్‌ వీల్స్‌ ఉన్నాయి. టియాగో ఈవీలో కూడా ఇంచుమించు ఐస్‌ మోడల్‌ డిజైన్‌నే పోలి ఉంటుంది. ఇక, ఇంటీరియర్‌ విషయానికొస్తే.. ఇందులో 2 స్పోక్‌ స్టీరింగ్‌ వీల్‌ ఇచ్చారు. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌ సెంటర్‌, డ్యూయల్ వైర్‌లెస్‌ ఛార్జర్‌, 360 డిగ్రీల కెమెరా, బ్లైండ్‌ స్పాట్ మానిటర్‌, రియర్‌ ఏసీ వెంట్స్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌, రెయిన్‌ సెన్సింగ్‌ వైపర్స్‌, ఆటో హెడ్‌ల్యాంప్స్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ పరంగా దీనిలో ఆరు ఎయిర్‌బ్యాగులు ఇచ్చారు. ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ, హిల్‌ హోల్డ్‌ కంట్రోల్‌ వంటివి ఉన్నాయి.

Also read: Resign : కన్నడ కోటలో కలకలం.. కుర్చీ దిగిన సిద్ధరామయ్య, కాబోయే సీఎం డీకే!

ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 215 కిలోమీటర్ల ప్రయాణం..

టియాగోలో 1.2 లీటర్‌ నాచురల్‌ యాస్పిరేటెడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ అమర్చారు. ఇది 86 హెచ్‌పీ పవర్‌ను, 113 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సీఎన్‌జీలోనూ 1.2 లీటర్‌ ఇంజిన్‌ అమర్చారు. ఇది 74 హెచ్‌పీ పవర్‌ను, 96 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 5 స్పీడ్‌ మాన్యువల్‌, 5 స్పీడ్‌ ఏఎంటీ అనే రెండు ఆప్షన్లలో లభిస్తాయి. ఇక, టియాగో ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్‌ ఆప్షన్లలో లభిస్తుంది. 19.2 kWh బ్యాటరీ సామర్థ్యం కలిగిన కారు సింగిల్‌ ఛార్జింగ్‌తో 205 కిలోమీటర్లు, 24kWh బ్యాటరీ వేరియంట్‌తో 215 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది. 3.3kW పోర్టబుల్‌ ఛార్జర్‌, 7.2kW హోమ్‌ ఛార్జర్‌, 30kW డీసీ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News