Tata Nexon Vs Hyundai Venue cars: ఇండియాలో SUVలకు నిరంతరం డిమాండ్ పెరుగుతోంది. వినియోగదారులు ఈ కార్లను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా మార్కెట్లో అనేక కార్ల కంపెనీ తయారీదారులు ఈ సెగ్మెంట్‌లో తమ ఉత్పత్తులను అందిస్తున్నాయి. ఈ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ చాలా కాలంగా వెన్యూను అందిస్తోంది. మరోవైపు టాటా మోటర్స్ నెక్సాన్ కూడా ఈ సెగ్మెంట్‌లో మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే, ఇప్పుడు ధర, ఇంజిన్, మైలేజ్, ఫీచర్ల పరంగా..ఈ రెండు SUVలలో ఏది ఉత్తమమైనదో ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Tata Nexon Vs Hyundai Venue ధర:
టాటా నెక్సాన్ SUV ఎక్స్-షోరూమ్ ధర రూ. 8 లక్షల నుండి ప్రారంభమవుతుంది. దీని టాప్ వేరియంట్ రూ. 15.60 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులో ఉంది.
ఇక హ్యుందాయ్ వెన్యూ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.94 లక్షల నుండి ప్రారంభమవుతుంది. దీని టాప్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.62 లక్షలు.
Tata Nexon Vs Hyundai Venue ఇంజిన్
ఇంజిన్ పరంగా.. టాటా నెక్సాన్ పెట్రోల్, డీజిల్, CNG ఇంజిన్‌ల ఎంపికతో తీసుకొచ్చారు. ఇందులో ఇచ్చిన 1.2 లీటర్ కెపాసిటి గల CNG ఇంజిన్ 73.5 PS పవర్, 170 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఇస్తుంది. ఇక 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ SUV 88.2 PS పవర్, 170 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఇస్తుంది. ఇదే ఈ కారు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 84.5 PS పవర్, 260 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఇస్తుంది. ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలు ఇచ్చారు.
మరోవైపు..హ్యుందాయ్ వెన్యూలో 1.2, ఒక లీటర్ టర్బో, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. దీని 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఈ SUVకి 83 PS పవర్, 113.8 న్యూటన్ మీటర్ టార్క్ ఇస్తుంది. ఒక లీటర్ టర్బో ఇంజిన్ 120 PS పవర్, 172 న్యూటన్ మీటర్ టార్క్ ఇస్తుంది. ఇక ఈ కారు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఈ SUVకి 116 PS పవర్, 250 న్యూటన్ మీటర్ టార్క్ ఇస్తుంది. హ్యుందాయ్ తన SUVలో ఐదు, ఆరు స్పీడ్ మాన్యువల్ అలాగే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందిస్తోంది.
Also Read: Cars: అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఇవే..
Tata Nexon Vs Hyundai Venue ఫీచర్లు:
టాటా నెక్సాన్‌లో ఫీచర్ల విషయానికి వస్తే.. బై-ఫంక్షన్ ఫుల్ LED హెడ్‌లైట్లు, ఇందులో షార్క్ ఫిన్ యాంటెన్నా, LED DRL, LED హై మౌంట్ స్టాప్ లాంప్, రూఫ్ రైల్, పనోరమిక్ సన్‌రూఫ్, ఫ్రంట్ ఫాగ్ లాంప్, 16 అంగుళాల అల్లాయ్ వీల్స్, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు అందించారు. అంతేకాకుండా ఈ కారులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, ఎయిర్ ప్యూరిఫైయర్, 360 డిగ్రీ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, పుష్ బటన్, స్మార్ట్ కీ, రియర్ AC వెంట్, వైర్‌లెస్ ఛార్జర్ వంటి లక్షణాలు ఉన్నాయి.
మరోవైపు.. హ్యుందాయ్ వెన్యూలో ఫీచర్లు చూస్తే..ఇందులో LED లైట్లు, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, కనెక్ట్ చేయబడిన టెయిల్ ల్యాంప్‌లు, 15, 16 అంగుళాల అల్లాయ్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, D కట్ స్టీరింగ్, యాంబియంట్ లైట్లు, స్పోర్టీ మెటల్ పెడల్స్, ఎనిమిది అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, స్టీరింగ్ వీల్స్‌పై ఆడియో, బ్లూటూత్ నియంత్రణలు వంటివి అందించారు. అంతేకాదు రిమోట్ ఇంజిన్ స్టార్ట్, స్మార్ట్ కీ, నార్మల్, ఎకో, స్పోర్ట్స్ డ్రైవింగ్ మోడ్‌లు, సన్‌రూఫ్, రియర్ AC వెంట్స్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, క్రూయిజ్ కంట్రోల్, లేన్ చేంజింగ్ ఇండికేటర్, ISG వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
Tata Nexon Vs Hyundai Venue సెఫ్టి ఫీచర్లు
టాటా నెక్సాన్ SUV ABS, EBD, ఆరు ఎయిర్‌బ్యాగులు, హిల్ హోల్డ్ కంట్రోల్, ESP, ఇమ్మొబిలైజర్, ISOFIX చైల్డ్ యాంకరేజ్, స్పీడ్ అలర్ట్, పార్కింగ్ సెన్సార్, ట్రాక్షన్ కంట్రోల్, TPMS, ప్రీ-టెన్షనర్‌తో సీట్ బెల్ట్ వంటి భద్రతా ఫీచర్లను అందించారు.
మరోవైపు..హ్యుందాయ్ వెన్యూలో ఆరు ఎయిర్‌బ్యాగులు, డాష్‌క్యామ్, ABS, EBD, ESC, BAS, VSM, HAC, వెనుక పార్కింగ్ సెన్సార్, వెనుక కెమెరా, ఆటో హెడ్‌ల్యాంప్, TPMS, ADAS వంటి భద్రతా లక్షణాలతో తీసుకొచ్చారు.


