HomeTop StoriesTata Sierra EV: మార్కెట్‌లోకి టాటా సియారా ఈవీ.. సింగిల్‌ ఛార్జింగ్‌తో 665 కి.మీ. ప్రయాణం

Tata Sierra EV: మార్కెట్‌లోకి టాటా సియారా ఈవీ.. సింగిల్‌ ఛార్జింగ్‌తో 665 కి.మీ. ప్రయాణం

Tata Sierra EV Launch here are the features: ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ టాటా మోటార్స్‌ ప్యాసింజర్స్‌ వాహనాల శ్రేణిలో సియారా ఈవీని దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది. గతేడాది మిడ్‌ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఐసీఈ మోడల్‌ను ఆవిష్కరించిన టాటా మోటార్స్‌.. తాజాగా ఓ సరికొత్త ఎలక్ట్రిక్‌ మోడల్‌ను లాంచ్‌ చేసింది. దీని ప్రారంభ ధర రూ.18.79 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌)గా నిర్ణయించింది. టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ను రూ.24.79 లక్షలుగా పేర్కొంది. టాటా మోటార్స్‌ ఈవీ లైనప్‌లో వచ్చిన ఏడో మోడల్‌ ఇది. సియారా ఈవీకి సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే‌ ప్రారంభమయ్యాయి. జులై 15 నుంచి డెలివరీలను సైతం ప్రారంభించింది. టాటా సియారా మొత్తం రెండు బ్యాటరీ ప్యాక్‌ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. 75 kWh బ్యాటరీ ప్యాక్ ఒకసారి ఛార్జ్ చేస్తే 665 కిలోమీటర్లు (MIDC రేంజ్) దూరం ప్రయాణించవచ్చు. రియల్‌టైమ్‌లో 500 కిలోమీటర్లకు పైగానే దూరం ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. 63 kWh బ్యాటరీ ప్యాక్‌లో సింగిల్‌ ఛార్జ్‌తో 565 కిలోమీటర్లు (ఎంఐడీఈ రేంజ్) ప్రయాణించొచ్చని కంపెనీ చెబుతోంది. 120 kW ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి కేవలం 15 నిమిషాల్లోనే 250 కి.మీ. పైగా ప్రయాణించేలా ఛార్జ్ చేసుకోవచ్చని పేర్కొంది. సియారా ఈవీ క్వాడ్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభిస్తుంది. దీని భాగంలోని మోటార్ 175 కిలో వాట్స్‌ పవర్, 240 ఎన్‌ఎం టార్క్, ముందు మోటార్ 103 kW పవర్, 164 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మొత్తంగా 504 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

- Advertisement -

Also Read: Trump: అమెరికా సుప్రీం కోర్టులో ట్రంప్‌కు షాక్‌.. జన్మతః పౌరసత్వాన్ని సమర్ధించిన కోర్టు

ట్రిపుల్-స్క్రీన్ లేఅవుట్‌ క్యాబిన్‌..

ఇక, ఇంటీరియర్‌ ఫీచర్ల విషయానికొస్తే.. క్యాబిన్‌ ట్రిపుల్-స్క్రీన్ లేఅవుట్‌తో వస్తుంది. ఇందులో 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 అంగుళాల ప్యాసింజర్ డిస్‌ప్లే వంటివి చేర్చింది. ఇక, యాపిల్‌ కార్‌ప్లే, డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో కూడిన 12 జేబీఎల్‌ స్పీకర్లను అమర్చింది. వైర్‌లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్, అటానమస్ పార్కింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లను అమర్చింది. ADAS లెవెల్ 2 ఫీచర్లు, ఈఎస్‌పీ, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 540 డిగ్రీల కెమెరా వంటి భద్రతా ఫీచర్లతో దీన్ని డిజైన్‌ చేసింది. దీనిలో అల్లాయ్‌ వీల్స్‌ను కూడా అందించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News