TCS Layoffs: ప్రముఖ టెక్ దిగ్గజం, భారత దేశపు అతి పెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ షాక్ ఇచ్చింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో అంటే 2026 ఏప్రిల్ నుంచి ఉద్యోగుల సంఖ్యను 2శాతం తగ్గించుకోనుంది. తాజా త్రైమాసికానికి టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 6,13,000 గా ఉంది. అంటే దాదాపు 12000 మందికి పైగా ఉద్యోగులను తొలగించనుంది. టీసీఎస్ సీఈఓ కే. కృతివాసన్ మనీకంట్రోల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా తెలిపారు.
సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా టీసీఎస్ ని మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఇది కఠినమైన నిర్ణయం అయినప్పటికీ భవిష్యత్ కోసం సన్నద్ధం కావాలంటే ఇది తప్పనిసరి అని సీఈఓ పేర్కొన్నారు. అన్ని దేశాల్లోని టీసీఎస్ విభాగాల్లో ఉద్యోగాల కోత అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా మిడ్-సీనియర్ స్థాయిలో తొలగింపులు ఉంటాయని కే. కృతివాసన్ ఇంటర్వ్యూలో తెలిపారు.
Readmore: https://teluguprabha.net/business/rbi-governor-key-comments-on-upi-payments/
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆపరేటింగ్ మోడల్ మార్పులను గుర్తిస్తూ.. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఏఐని వినియోగిస్తామని ఆయన అన్నారు. భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలను ఎవాల్యుయేట్ చేస్తున్నాం. మా కంపెనీ విస్తరణ అవకాశాలను మెరుగుపరిచేందుకు ఎక్కువ శాతం పెట్టుబడులు పెట్టాం. కానీ, పలు విభాగాల్లో వృద్ధి కనిపించడం లేదు. దాంతో ఈ నిర్ణయం తప్పడం లేదని ఆయన అన్నారు.
కోతకు గురయ్యే ఉద్యోగులకు ముందుగానే నోటీసులు ఇస్తున్నట్టు, వారికి బీమా పొడగింపు, అవుట్ ప్లేస్ మెంట్ సపోర్ట్ కూడా ఇస్తామని అన్నారు. సాధ్యమైనంత రీతిలో ఆ ఉద్యోగులకు మేలు చేసేందుకు కంపెనీ కృషి చేస్తుందని తెలిపారు.


