Saturday, November 15, 2025
Homeబిజినెస్TCS LayOffs: సీనియర్లను నియమించుకునే పరిస్థితులే లేవు!

TCS LayOffs: సీనియర్లను నియమించుకునే పరిస్థితులే లేవు!

TCS LayOffs: దేశంలో ఐటీ రంగాన్ని నడిపించే ప్రముఖ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రస్తుతం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సంస్థ వ్యయ నియంత్రణ చర్యల నేపథ్యంలో, సీనియర్ స్థాయి ఉద్యోగుల నియామకాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. అంతేకాదు, ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులకు వార్షిక జీతాల పెంపు ప్రక్రియను కూడా నిలిపివేసినట్లు తెలుస్తోంది.

- Advertisement -

12,000కి పైగా ఉద్యోగాల కోత…

ఇది ఏకకాలంలో రావడం కాకుండా, గతంలో ప్రకటించిన కొన్ని నిర్ణయాల నడుమ టీసీఎస్ తాజా చర్యలు చర్చకు వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితమే సంస్థ సీఈఓ కే కృతివాసన్ సంస్థలో దాదాపు 2 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించారు. ఇది సంఖ్య పరంగా చూస్తే 12,000 మందికి పైగా ఉద్యోగాల కోతకు దారితీస్తుంది.

సీనియర్ ఉద్యోగులకు కూడా…

ఇదిలా ఉండగా, తాజాగా మరో అంశం తెరమీదకు వచ్చింది. టీసీఎస్ ఇప్పటికే రిక్రూట్ చేసిన సీనియర్ ఉద్యోగులకు కూడా జాయినింగ్ విషయంలో ఆలస్యం చేస్తోంది. ప్రధానంగా పుణే, హైదరాబాద్, చెన్నై, కోల్‌కత్తా వంటి కేంద్రాల్లో బెంచ్‌పై ఉన్న సిబ్బందిని లక్ష్యంగా చేసుకొని చర్యలు తీసుకుంటోంది. సాధారణంగా సంస్థల్లో బెంచ్‌ పాలసీ కింద ఒక ఉద్యోగి నిర్దిష్ట కాలం పాటు పని లేకుండా ఉంటే, తరువాత ప్రత్యామ్నాయ బాధ్యతలు అప్పగించేవారు. కానీ ఇప్పుడు టీసీఎస్ కఠినంగా వ్యవహరిస్తోంది. 35 రోజులకు మించినపుడు ఉద్యోగులు బెంచ్‌లో కొనసాగకూడదనే నిబంధనను కఠినంగా అమలు చేస్తోంది.

ఇటీవల ఐటీ రంగంలో ఏర్పడిన మార్పులు కూడా ఈ నిర్ణయాలపై ప్రభావం చూపినట్లు పరిశీలనకు వస్తోంది. కృత్రిమ మేధ (AI) వంటి సాంకేతిక పరిజ్ఞానాల వేగవంతమైన అభివృద్ధి.. ఐటీ సేవలకు గల డిమాండ్‌లో తగ్గుదల వంటి అంశాలు ఉద్యోగ కల్పనలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో టీసీఎస్ వలె పెద్ద సంస్థలు తీసుకునే నిర్ణయాలు, చిన్న, మధ్యతరహా కంపెనీలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Also Read:https://teluguprabha.net/business/today-prices-of-gold-and-silver-prices-in-telugu-states/

అంతేకాదు, కంపెనీ చేపట్టిన సీనియర్, మిడ్ లెవెల్ ఉద్యోగుల తొలగింపు ద్వారా దాదాపు రూ.2,400 నుంచి రూ.3,600 కోట్ల వరకు ఖర్చులను తగ్గించుకోవచ్చని అంచనా. ఈ నిర్ణయాన్ని సంస్థ ఒకేసారి కాకుండా, పద్ధతిగా దశల వారీగా అమలు చేస్తుందనేది టీసీఎస్ సీఈఓ వివరణ.

ఇక ఈ పరిణామాలపై కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ దృష్టి పెట్టినట్లు సమాచారం. ఉద్యోగ కోతపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోయినా.. కేంద్రం ఈ అంశాన్ని గమనిస్తూ టీసీఎస్‌తో సంప్రదింపుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: https://teluguprabha.net/business/stock-market-closes-with-losses/

టీసీఎస్ షేరు ధరలపై కూడా ఈ చర్యలు ప్రభావం చూపినట్లు మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. గత ఏడాదిలో కంపెనీ షేర్లు దాదాపు 30 శాతం వరకు పడిపోయాయి. నిఫ్టీ ఐటీ సూచీలో టీసీఎస్ ప్రదర్శన బలహీనంగా ఉందని మార్కెట్ విశ్లేషణలు చెబుతున్నాయి.ఐటీ రంగంలో టీసీఎస్ లాంటి దిగ్గజం కూడా నియామకాల విషయంలో వెనుకడుగు వేయడం, ఉద్యోగాలపై ఆంక్షలు పెట్టడం అనేది పరిశ్రమలో ఉన్న అస్థిరతను చూపిస్తుంది. గతంలో జాబ్ సెక్యూరిటీ ఎక్కువగా ఉండే రంగంగా భావించబడిన ఐటీ రంగం ఇప్పుడు మారుతున్న తత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగుల భద్రతపై ఆందోళన పెరుగుతున్నా.. కంపెనీలు మాత్రం వ్యయ నియంత్రణ, లాభాల మెరుగుదల దిశగా దృష్టి పెడుతున్నాయి. టీసీఎస్ తీసుకున్న ఈ నిర్ణయాలు మిగతా సంస్థలకు ఉదాహరణగా మారే అవకాశం ఉంది.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad