Gold and silver price: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్ అతలాకుతలం అవుతుంది. దీంతో పసిడి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. నేడు బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా పతనమయ్యాయి.
వేలల్లో తగ్గిన పసిడి ధర: అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాల ప్రభావం దేశీయ మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ ధరల తగ్గింపు కొనుగోలుదారులకు పెద్ద వరంగా మారింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.1800 తగ్గి.. ప్రస్తుతం రూ.1,49,130 వద్ద కొనసాగుతోంది. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల10 గ్రాముల బంగారంపై రూ.1650 పతనమై.. ధర రూ.1,36,700కి చేరింది. అయితే లైవ్ ట్రేడింగ్‌ను బట్టి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం షాపుల్లో ఈ ధరల్లో హెచ్చుతగ్గులు నమోదు అయ్యే ఛాన్సుంది.
స్థిరంగా కొనసాగుతున్న వెండి ధర: గత కొన్ని రోజులుగా వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. సోమవారం కిలో వెండి ధర రూ.2,55,000 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ధరలు ఒక్కసారిగా వేలల్లో తగ్గడంతో జ్యువెలరీ షాపులు కస్టమర్లతో కిటకిటలాడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. గ్లోబల్ మార్కెట్ పరిస్థితుల కారణంగానే ఈ తగ్గుదల నమోదైందని పేర్కొన్నారు.

