Homeబిజినెస్Sensex: నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. 700 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్!

Sensex: నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. 700 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్!

Stock market: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ కూటమి జరుపుతున్న దాడులతో దలాల్ స్ట్రీట్ అతలాకుతలం అవుతుంది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితితో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ప్రారంభంలోనే భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు భారీ పతనంతో ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది.

- Advertisement -

మార్కెట్ల తాజా పరిస్థితి: మంగళవారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సెన్సెక్స్ 700 పాయింట్ల మేర క్షీణించి 73,420 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 200 పాయింట్లు కోల్పోయి 22,770 వద్ద ట్రేడవుతోంది. కేవలం భారత్ మాత్రమే కాకుండా ఆసియా మార్కెట్లన్నీ నష్టాల బాటలోనే కొనసాగుతున్నాయి. యుద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియని ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లు మరికొంత కాలం ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Also read-Gold Prices: మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఈ సారి ఏకంగా!

చమురు దెబ్బతో రూపాయి విలవిల: ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ చేసిన హెచ్చరికలు మార్కెట్లను వణికించాయి. భారత్ తన చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది. దీంతో ముడిచమురు ధరల పెరుగుదల దేశీయ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుందనే భయం నెలకొంది. ఈ ప్రభావంతో భారత కరెన్సీ రూపాయి విలువ తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం 17 పైసలు నష్టపోయి 93.07 వద్ద కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News