Top 5 High Milage Electric Scooters in India: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ఛార్జీలు, పర్యావరణ కాలుష్యం కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. తక్కువ ధరనే అధిక మైలేజ్ ఇస్తుండటంతో ఈ-స్కూటర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. భారత మార్కెట్లో ప్రస్తుతం చాలా మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ఓలా S1X, టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, అథర్ రిజ్టా, హోండా యాక్టివా E వెహికిల్స్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ స్కూటర్లు 50-100 కిలోమీటర్ల మైలైజీని అందిస్తాయి. ప్రస్తుతం భారత మార్కెట్‌లో అత్యధిక మైలేజీని అందిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటీల గురించి తెలుసుకుందాం.
ఓలా S1X
ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ అతి తక్కువ సమయంలోనే అత్యంత పాపులర్ స్కూటీగా పేరొందింది. దీని ఎంట్రీ-లెవల్ మోడల్ చాలా రిచ్ లుక్‌తో వస్తుంది. దీని 2025 మోడల్ 2kWh, 3kWh, 4kWh బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.79,999 నుండి ప్రారంభమవుతుంది. ఇందులో 4kWh బ్యాటరీ వేరియంట్ IDC-సర్టిఫైడ్ 242 కి.మీ మైలేజీని అందిస్తుంది. అలాగే 5.5kW హబ్ మోటార్ గరిష్టంగా గంటకు 90 కి.మీ వేగాన్ని అందిస్తుంది. ఇది 7 అంగుళాల TFT డిస్ప్లే, నావిగేషన్, క్రూయిజ్ కంట్రోల్, OTA అప్‌డేట్‌లు, రివర్స్ మోడ్, రీజెనరేటివ్ బ్రేకింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
టీవీఎస్ ఐక్యూబ్
టీవీఎస్ ఐక్యూబ్ కూడా తక్కువ ధరలో భారీ మైలేజ్‌ను అందిస్తుంది. ఇది 2.2kWh, 3.5kWh, 5.1kWh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. దీని లేటెస్ట్ మోడల్ రూ.96,422 ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర వద్ద లభిస్తుంది. దీని 5.1kWh హై వేరియంట్ సింగిల్ ఛార్జింగ్‌తో 212 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఇది గంటకు 78 కి.మీ వేగాన్ని కలిగి ఉంటుంది. ఇందులో కూడా 7 అంగులాల టచ్ స్క్రీన్, వాయిస్ అసిస్ట్, టర్న్ బై టర్న్ నావిగేషన్ సహా మరెన్నో ఫీచర్లున్నాయి.
బజాజ్ చేతక్
బజాజ్ చేతక్ క్లాసిక్ డిజైన్, ఆధునిక టెక్నాలజీతో రిలీజైంది. 2025 చేతక్ 3501 మోడల్ 3.5kWh బ్యాటరీతో వస్తుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 153 కి.మీ. మైలేజీ అందిస్తుంది. దీన్ని రూ.1,02,400 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. దీని 4kW మోటార్ గంటకు 73 km గరిష్ట వేగాన్ని అందిస్తుంది.
అథర్ రిజ్టా
అథర్ రిజ్టా రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో లభిస్తుంది. అవి 2.9kWh, 3.7kWh బ్యాటరీలతో అందుబాటులో ఉంటాయి. ఈ మోడల్ రూ.1,04,999 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో లభిస్తుంది. దీని 3.7kWh బ్యాటరీ ప్యాక్ సింగిల్ ఛార్జింగ్‌పై 159 కి.మీ మైలేజ్‌ను అందిస్తుంది. ఇది గంటకు 80 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది.
హోండా యాక్టివా ఈ
హోండా యాక్టివా ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ 1.5kWh రిమూవెబుల్ బ్యాటరీ ప్యాక్‌తో లభిస్తుంది. ఇది సింగిల్ ఛార్జింగ్‌పై 102 కి.మీ మైలేజీ అందిస్తుంది. హోండా యాక్టివా-ఇ ధర రూ.117,428 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. దీనిపై గరిష్టంగా గంటకు 80 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు.


