Saturday, November 15, 2025
HomeTop StoriesUpcoming SUV: త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానున్న టాప్ 5 ఎస్‌యూవీ కార్లు

Upcoming SUV: త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానున్న టాప్ 5 ఎస్‌యూవీ కార్లు

Upcoming SUV Cars: ఇతర విభాగాలతో పోలిస్తే ఎస్‌యూవీ కార్లకు భారత ఆటో మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉంది. దీని కారణంగానే కార్ల కంపెనీ తయారీదారులు వివిధ విభాగాలలో అనేక వాహనాలను విడుదల చేస్తున్నాయి. హ్యాచ్ బ్యాక్, సెడాన్ కార్ల కన్నా కూడా కాంపాక్ట్ ఎస్‌యూవీలు, ఎస్‌యూవీల అమ్మకాలు ఊపందుకుంటున్నాయి. ఈ క్రమంలో దేశ, విదేశీ ఆటోమేకర్స్ కొత్త ఎస్‌యూవీ కార్లను ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేస్తున్నారు. వచ్చే కొన్ని నెలల్లో ఏ కంపెనీ తయారుదారు, ఏ ఎస్‌యూవీలను విడుదలచేసే అవకాశం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

- Advertisement -

 

హ్యుందాయ్ వెన్యూ

భారత ఆటోమార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ హ్యుందాయ్ వెన్యూను విక్రయిస్తుంది. కంపెనీ వచ్చే నవంబర్ 4న ఈ ఎస్‌యూవీ కొత్త వెర్షన్ తో భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేయనుంది. ఇప్పటికే తయారీదారు ఈ SUV కొత్త కారు గురించి పూర్తి వివరాలను వెల్లడించింది. ఇది అనేక ఆధునిక ఫీచర్లతో వస్తుంది.

టాటా సియెర్రా

టాటా మోటార్స్ దేశంలోని అనేక విభాగాలలో వాహనాలను విక్రయిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తయారీదారు నవంబర్‌లో టాటా సియెర్రాను విడుదల చేయనుందని సమాచారం. ఈ కారు లాంచ్ డేట్ అధికారికంగా ఇంకా పెండింగ్‌లో ఉన్నప్పటికీ ఈ ఎస్‌యూవీ నవంబర్ చివరిలో మార్కెట్లో విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు.

also read:Vivo T4 Lite 5G Discount: రూ. 9,999కే వివో T4 లైట్ 5G..ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

రెనాల్ట్ డస్టర్

రెనాల్ట్ కొత్త డస్టర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కానీ, ఇంకా అధికారిక లాంచ్ తేదీ ప్రకటించలేదు. కంపెనీ చాలా దేశాలలో దీనిని రెనాల్ట్ బదులుగా డాసియా డస్టర్ పేరుతో మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. అయితే, ఈ ఎస్‌యూవీని హైబ్రిడ్ ఇంజిన్‌తో అందించవచ్చని తెలుస్తోంది.

నిస్సాన్ టెక్టన్

నిస్సాన్ ఇటీవల టెక్టన్ ఎస్‌యూవీని టీజ్ చేసింది. ఖచ్చితమైన లాంచ్ డేట్ తెలియనప్పటికీ, తయారీదారు ఈ ఎస్‌యూవీని వచ్చే ఏడాది మొదట్లో విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇది రెనాల్ట్ డస్టర్ ప్లాట్‌ఫామ్‌పై తయారు కానుంది. అయితే, రెండు ఎస్‌యూవీలు అనేక మార్పులను పొందుతాయి.

స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌

స్కోడా కుషాక్ ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేయడానికి కూడా సిద్ధమవుతోందని నివేదికలు సూచిస్తున్నాయి. దీని లాంచ్ కు ముందు, ఇది భారతీయ రోడ్లపై అనేకసార్లు పరీక్షించబడుతున్నట్లు కనిపించింది. ఇది దీని ముందు, వెనుక భాగాలలో సల్ప మార్పులు చేశారని సూచిస్తుంది. అయితే, కారు సైడ్ ప్రొఫైల్ ప్రస్తుత వెర్షన్‌లాగే ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad