Bikes Under Rs.2 Lakhs: దేశంలో పండగ సీజన్ ప్రారంభమైంది. దీపావళి సందర్బంగా చాలామంది అనేక కొత్త వస్తువులు కొనడానికి ఆసక్తి చూపుతుంటారు. అందులో వాహనాలు కూడా ఒకటి. మీరు కూడా ఈ సమయంలో కొత్త బైక్ కొనాలని ప్లాన్ చేస్తుంటే మీకో గుడ్ న్యూస్! హీరో, యమహా, టీవీఎస్, రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంటి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీల బైక్స్ రూ.2 లక్షల రూపాయల లోపు అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్‌లన్నీ గొప్ప ఫీచర్లతో అద్భుతమైన మైలేజీని అందిస్తాయి.
1. Hero Splendor Plus
హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీని ధర రూ.73,902 నుండి రూ.76,437 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇది ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రసిద్ధ మోటార్ సైకిళ్లలో ఒకటి. తక్కువ మెయింటనెన్స్ ఖర్చులు, సులభమైన రైడింగ్, దేశవ్యాప్తంగా సర్వీస్ నెట్‌వర్క్ దీనిని పరిపూర్ణ కమ్యూటర్‌గా చేస్తాయి. బడ్జెట్ ధరలో ఈ దీపావళికి కొత్త బైక్ కొనాలనుకునేవారికి ఇది ఉత్తమ ఎంపిక అవుతుంది.
2. TVS Raider 125
టీవీఎస్ రైడర్ 125 సీసీ బైక్ ను రూ.80,500 నుండి రూ.95,600 (ఎక్స్-షోరూమ్) ధర వరకు కొనుగోలు చేయవచ్చు. ఇది దీని మైలేజీకి మాత్రమే కాకుండా, సులభమైన రైడ్‌కు కూడా ప్రసిద్ధి చెందింది. ఈ బైక్ డిజైన్, బగ్-ఐ హెడ్‌లైట్‌లు, కలర్ వేరియంట్లు యువతను ఆకర్షిస్తాయి. ఇది డిస్క్ బ్రేక్‌లు, సింగిల్-ఛానల్ ABS, డిజిటల్ TFT డిస్ప్లే వంటి ఫీచర్లతో వస్తుంది. దీని మైలేజ్ 55 kmpl కంటే ఎక్కువే!
3. TVS Apache RTR 160 4V
160cc విభాగంలో వస్తోంది ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.15 లక్షల నుండి రూ.1.35 లక్షల వరకు అందుబాటులో ఉంది. దీని ఇంజిన్ స్మూత్‌గా ఉంటుంది. పవర్ డెలివరీ చాలా లీనియర్‌గా ఉంటుంది. ఇది పట్టణ, హైవే రోడ్లపై అద్భుతమైన పనితీరును అందిస్తుంది. దీని రైడింగ్ డైనమిక్స్ అద్భుతంగా ఉంటాయి. ఇది కార్నరింగ్, హ్యాండ్లింగ్ రెండింటిలోనూ అగ్రగామిగా ఉంది.
4. Yamaha R15 V4
యమహా R15 V4 ధర రూ.1.69 లక్షల నుండి రూ.1.74 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇది 150cc విభాగంలో సాటిలేనిది. దీని ఏరోడైనమిక్ డిజైన్, హెడ్‌ల్యాంప్‌లు, పనితీరు ఈ బైక్ ను ప్రత్యేకంగా చేస్తాయి. కంపెనీ ఇందులో అధునాతన ఫీచర్లు, అద్భుతమైన హ్యాండ్లింగ్, స్మూత్ ఇంజిన్‌ను అందించింది.
5. Royal Enfield Classic 350
యూత్ లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ కు ఉన్న క్రేజ్ వేరు! చాలామందికి రాయల్ ఎన్‌ఫీల్డ్ కలల బైక్. ఈ బైక్ ధర రూ.1.81 లక్షల నుండి ₹2.15 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. 349CC జే-ప్లాట్‌ఫారమ్ సింగిల్ ఇంజిన్‌తో వస్తుంది. ట్రాఫిక్ వంటి రద్దీ రోడ్లలో రైడింగ్ చాలా సులభంగా ఉంటుంది. రిలాక్స్డ్ ఎర్గోనామిక్స్, హ్యాండ్లింగ్, సీట్లు, లగేజ్, స్క్రీన్‌ల వంటి అప్లియన్సెస్ అత్యంత అనుకూలంగా ఉంటుంది.


