Thursday, July 10, 2025
Homeబిజినెస్Crude oil reserves : నల్ల బంగారం.. ఏ దేశాల్లో ముడి చమురు నిల్వలు ఎక్కువ..

Crude oil reserves : నల్ల బంగారం.. ఏ దేశాల్లో ముడి చమురు నిల్వలు ఎక్కువ..

TOP 10 Crude oil reserves : విద్యుత్ ఉత్పత్తి చేసే బొగ్గునే కాదు ముడి చమురును కూడా “నల్ల బంగారం” అని పిలుస్తారు. దీనికి కారణం ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైంది. ముడి చమురు ఆధారంగా తయారయ్యే పెట్రోల్, డీజిల్, ప్లాస్టిక్, రసాయనాలు మొదలైన అనేక ఉత్పత్తులు పారిశ్రామిక రంగాల్లోనూ, గృహ అవసరాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ ముడి చమురుపై నియంత్రణ కోసం ప్రపంచ దేశాల యుద్ధాలే కాదు, ఈ దేశాల మధ్య వ్యూహాత్మక పోటీ కొనసాగుతోంది. పెట్రోలియం ఎగుమతిదారుల సంస్థ ఒపెక్ (OPEC) ప్రకారం, దక్షిణ అమెరికాలో ఉన్న వెనిజులా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక ముడి చమురు నిల్వలతో ఉన్న దేశంగా ముందుంది. ఈ దేశం వద్ద సుమారు 303 బిలియన్ బ్యారెల్స్ నిల్వలు ఉన్నాయి. ఇది ప్రపంచ మొత్తం నిల్వల్లో 17.3 శాతం ఉంటుంది.

- Advertisement -

ముడి చమురు నిల్వలున్న టాప్ 10 దేశాలు

  1. వెనిజులా – 303 బిలియన్ బ్యారెల్స్ (17.3%)
  2. సౌదీ అరేబియా – 267 బిలియన్ బ్యారెల్స్ (15.2%)
  3. ఇరాన్ – 209 బిలియన్ బ్యారెల్స్ (11.9%)
  4. కెనడా – 163 బిలియన్ బ్యారెల్స్ (9.3%)
  5. ఇరాక్ – 145 బిలియన్ బ్యారెల్స్ (8.3%)
  6. యుఎఇ – 113 బిలియన్ బ్యారెల్స్
  7. కువైట్ – 102 బిలియన్ బ్యారెల్స్
  8. రష్యా – 80 బిలియన్ బ్యారెల్స్
  9. అమెరికా – 74 బిలియన్ బ్యారెల్స్
  10. లిబియా – 48 బిలియన్ బ్యారెల్స్

వెనిజులా, ఇరాన్ లాంటి దేశాల్లో చమురు ధరలు తక్కువగా ఉండటం గమనార్హం. దీనివల్ల, ప్రజలకు తక్కువ ధరకు ఇంధనం అందుతుంది కానీ ఆర్ధిక పరంగా ప్రభుత్వం రెవెన్యూ తగ్గిపోతుంది.

అమెరికాలో పరిమిత నిల్వలు

ప్రస్తుతం అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ముడి చమురు ఉత్పత్తిదారుగా ఉన్నప్పటికీ, అతితక్కువ నిల్వలు కలిగిన దేశాలలో ఒకటిగా ఉంది. దీని ఆధారంగా చూస్తే, అమెరికా తన ఉత్పత్తి సామర్థ్యాన్ని వినియోగాన్ని తీరుస్తూ ఉంచాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలాగే, అంతర్జాతీయ మార్కెట్ లో దిగుమతులపై ఆధారపడకుండా తన స్వయం సమృద్ధిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది.

85% దిగుమతులపై ఆధారపడే భారత్

భారతదేశం విషయానికి వస్తే, ఇది తన ముడి చమురు అవసరాల్లో 85% దిగుమతులపై ఆధారపడుతోంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ఒత్తిడిని కలిగిస్తుంది. ముఖ్యంగా ఉక్రెయిన్-రష్యా యుద్ధం తర్వాత, రష్యా భారతదేశానికి అతిపెద్ద చమురు సరఫరాదారుగా మారింది. రష్యా చమురు భారత్ కు తగ్గింపు ధరలో లభిస్తోంది. అయితే రష్యా ఇచ్చే ధరలతో భారత ఇంధన బిల్లు కొంత మేర తగ్గినప్పటికీ, ఇతర సమస్యలు తలెత్తవచ్చు. ఇది పరోక్షంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులకు దారితీస్తుంది.

ముడి చమురుతో ముడిపడిన భవిష్యత్

భవిష్యత్తులో ముడి చమురు ప్రాముఖ్యత తగ్గవచ్చు అనే అంచనాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇదే కీలక పాత్ర పోషిస్తోంది. విండ్, బయో, బ్యాటరీలతో ఎనర్జీ కోసం దేశాల ప్రయత్నాలు పెరిగాయి. పునర్వినియోగ ఇంధనాల వైపు అడుగులు వేస్తున్నా కూడా, ముడి చమురు ఆధారిత ఉత్పత్తులు పూర్తిగా నిర్మూలించడం ఇప్పట్లో సాధ్యమయ్యే విషయం కాదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News