Top Mileage Bikes In Indian Automobile Market: మనం బైక్ కొనేముందు ధరతో పాటు మైలేజీని తప్పకుండా కనుక్కుంటాం. ఎందుకంటే, మైలేజీ ఎక్కువ ఇస్తేనే మనకు పెట్రోల్ భారం తగ్గుతుంది. మార్కెట్‌లో తక్కువ ధరలోనే అభించే నాలుగు బైక్‌లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఓవైపు, కొత్త జీఎస్టీతో ధరలు తగ్గడం, మరోవైపు ఎక్కువ మైలేజీ ఇస్తుండటంతో ఈ బైక్‌లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. కొత్త జీఎస్టీ అమలుతో 350cc బైక్‌లు మరింత చౌకగా మారాయి. ముఖ్యంగా ఇప్పటికే ధరలు తక్కువగా ఉన్నవి ఇప్పుడు మరింత చీప్ ధరకే లభిస్తున్నాయి. ఈ బైక్‌లలో కొన్ని 100 కి.మీ లేదా అంతకంటే ఎక్కువ మైలేజీని ఆఫర్ చేస్తున్నాయి. వీటి ద్వారా అధిక పెట్రోలు ధరల నుంచి బయటపడొచ్చు. ఈ జాబితాలో బజాజ్, హీరో వంటి కంపెనీలకు చెందిన బైక్‌లు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం.
1. ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ
బజాజ్ ఫ్రీడమ్ దేశంలోనే అత్యధిక మైలేజ్ కలిగిన బైక్‌గా నిలిచింది. ఈ బైక్ పెట్రోల్ , సీఎన్‌జీ రెండింటిలోనూ నడపగల 125 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 9.5 పీఎస్ పవర్, 9.7 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లోని సీఎన్‌జీ సిలిండర్ సీటు కింద ఉంటుంది. దీనికి 2 కిలోల CNG సిలిండ, 2 లీటర్ పెట్రోల్ ట్యాంక్‌లు ఉన్నాయి. ఇది 100 కి.మీ మైలేజీని ఇస్తుంది. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.90,976 వద్ద ఉంటుంది.
2. హీరో స్పెండర్
దేశంలో అత్యధికంగా అమ్ముడైన బైక్‌గా హీరో స్ప్లెండర్ ప్లస్ నిలిచింది. ఇప్పటివరకు 40 మిలియన్లకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది 97.2cసీసీ ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్-సిలిండర్, ఓహెచ్‌సీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 5.9 కిలోవాట్ పవర్, 8.05 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్‌సైకిల్ సుమారు 80 నుండి 85 కి.మీ/గం మైలేజీని అందిస్తుంది. ఇది మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. స్ప్లెండర్ ప్లస్ డ్రమ్ బ్రేక్ రూ.73,527 ఎక్స్-షోరూమ్ ధర వద్ద లభిస్తుంది.
3. బజాజ్ సీటీ 110 ఎక్స్
బజాజ్ వాహనాలు మైలేజీకి పెట్టింది పేరు. సీటీ 110X, సీటీ 125X బైక్‌లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. నివేదికల ప్రకారం, ఈ వాహనాలు 70 కెఎమ్‌పిఎల్ లేదా కొంచెం ఎక్కువ మైలేజీని అందిస్తాయి. సీటీ 125X 124.4 సీసీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 10.9 పీఎస్ పవర్, 11 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ధర రూ.67,284 (ఎక్స్‌షోరూమ్) ధర వద్ద లభిస్తుంది. ఇది CT 110X 115.45 సీసీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 8.6 పీఎస్ పవర్, 9.81 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ రూ.70,176 ప్రారంభ ధర వద్ద లభిస్తుంది.
4. బజాజ్ ప్లాటినా 100
బజాజ్ ప్లాటినా 100 అత్యంత ఇంధన-సమర్థవంతమైన వాహనంగా నిలిచింది. ఈ బైక్ 70 కెఎమ్‌పిఎల్ మైలేజ్ అందిస్తుంది. ఈ బైక్ 102 సీసీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 7.79 పీఎస్ పవర్, 8.34 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 4-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పనిచేస్తుంది. ఈ బైక్ రూ.65,407 ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉంది.


