Green Hydrogen Plant: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లో టోరెంట్ గ్రూప్ ఏర్పాటు చేసిన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు టోరెంట్ పవర్, టోరెంట్ గ్యాస్ సంయుక్త సహకారంతో అభివృద్ధి చేయబడింది. ఈ ప్లాంట్ వార్షికంగా 72,000 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. ఖజ్ని బ్లాక్ సమీపంలోని ఖానిపూర్ గ్రామంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.
ఈ ప్రాజెక్ట్ ఉత్తరప్రదేశ్‌లో స్థాపించబడిన తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కావడమే కాక, దేశంలోని CGD రంగంలో గ్రీన్ హైడ్రోజన్ – న్యాచురల్ గ్యాస్ మిశ్రమపు అతిపెద్ద ప్రాజెక్టుగా నిలిచింది. ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి అయ్యే గ్రీన్ హైడ్రోజన్‌ను టోరెంట్ గ్యాస్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) వేదికగా న్యాచురల్ గ్యాస్‌తో 2 శాతం మోతాదులో కలిపి సరఫరా చేయనున్నారు. ఈ మిశ్రమం గోరఖ్‌పూర్ పరిధిలోని గృహాలు, CNG స్టేషన్లు, పరిశ్రమలకు ఇప్పటికే ఏర్పాటు చేసిన గ్యాస్ పైప్‌లైన్ల ద్వారా అందజేయబడుతుంది.
Read more: https://teluguprabha.net/business/pm-svanidhi-scheme-street-vendors-loan/
గ్రీన్ హైడ్రోజన్ అనగా పునరుత్పాదక శక్తులైన సౌర, గాలి లేదా జలశక్తి వినియోగించి నీటిని ఎలక్ట్రోలైసిస్ విధానంలో శుద్ధి చేసి పొందే హైడ్రోజన్. ఇది పారంపరిక వనరుల నుండి తయారవుతున్న హైడ్రోజన్‌తో పోలిస్తే, కార్బన్ ఉద్గారాలు లేకుండా, శుభ్రమైన ఇంధనంగా పరిగణించబడుతుంది.
పర్యావరణాన్ని పరిరక్షించడంలో, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడంలో మరియు ఇంధన రంగంలో ఆవిష్కరణలను నడిపించడంలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కీలక పాత్ర పోషిస్తుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. గోరఖ్‌పూర్‌లో ఇప్పటికే టొరెంట్ గ్రూప్ యొక్క CNG యూనిట్ ఉందని, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌ను జోడించడంతో, నగరం కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో ముందంజలో ఉందని ఆయన పేర్కొన్నారు.
Read more: https://teluguprabha.net/business/gold-and-silver-prices-updates-today-in-various-cities-in-india-2/
గ్రీన్ ఎనర్జీ ప్రస్తుత పరిస్థితులలో ఖరీదైనదిగా అనిపించిన, త్వరలో ప్రతి ఇంటికి అందుబాటులోకి వస్తుంది. ఈ క్లీన్ ఎనర్జీ గృహాలు, పరిశ్రమలకు మాత్రమే శక్తినివ్వడమే కాకుండా ప్రపంచ విధిని కూడా మారుస్తుంది అని ముఖ్యమంత్రి అన్నారు.


