Saturday, February 14, 2026
Homeబిజినెస్Kevin Warsh Fed Chair: ఫెడ్ చీఫ్‌గా కెవిన్ వార్ష్ నామినేషన్: ట్రంప్ కీలక నిర్ణయం...

Kevin Warsh Fed Chair: ఫెడ్ చీఫ్‌గా కెవిన్ వార్ష్ నామినేషన్: ట్రంప్ కీలక నిర్ణయం వెనుక అసలు వ్యూహం ఇదేనా?

Kevin Warsh as Next Fed Chair: అమెరికా ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన ఫెడరల్ రిజర్వ్ (US Fed) తదుపరి సారథి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. అమెరికా అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్, ఫెడ్ తదుపరి చీఫ్‌గా కెవిన్ వార్ష్ (Kevin Warsh) పేరును అధికారికంగా ప్రకటించారు. ఈ నియామకంపై ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక నిపుణులు, మార్కెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుత ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్ పదవీకాలం 2026 మే నెలలో ముగియనుంది. ఈ నేపథ్యంలో, తన ఆర్థిక విధానాలకు అనుగుణంగా వ్యవహరించే వ్యక్తి కోసం అన్వేషించిన ట్రంప్, చివరకు 55 ఏళ్ల కెవిన్ వార్ష్ వైపు మొగ్గు చూపారు.

- Advertisement -

ట్రంప్ – పావెల్ మధ్య విభేదాలు
గతంలో 2017లో పావెల్‌ను ఫెడ్ చీఫ్‌గా ఎంపిక చేసింది ట్రంప్ ప్రభుత్వమే అయినప్పటికీ, ఆ తర్వాత వారి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వడ్డీ రేట్ల తగ్గింపు విషయంలో పావెల్ అనుసరించిన కఠిన వైఖరిపై ట్రంప్ పలుమార్లు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. “కెవిన్ నన్ను ఎప్పటికీ నిరాశపరచడు” అంటూ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేయడం ద్వారా, భవిష్యత్తులో వడ్డీ రేట్ల విషయంలో తన ఆలోచనలకు వార్ష్ మద్దతు ఉంటుందని ట్రంప్ సంకేతాలిచ్చారు.

Also Read:LIC : – Telugu Prabha Telugu Daily రూ. 10 వేల SIPతో రూ. 34 లక్షల సంపద

కెవిన్ వార్ష్ ప్రస్థానం
కెవిన్ వార్ష్‌కు ఫెడరల్ రిజర్వ్‌లో పనిచేసిన అపారమైన అనుభవం ఉంది. 2006లో కేవలం 35 ఏళ్ల వయసులోనే ఫెడరల్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌లో సభ్యుడిగా చేరి, ఆ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో ఫెడ్ తీసుకున్న నిర్ణయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. 2011లో ఫెడ్ నుండి వైదొలిగిన ఆయన, ప్రస్తుతం స్టాన్‌ఫర్డ్ బిజినెస్ స్కూల్‌లో లెక్చరర్‌గా , ఆర్థికవేత్తగా కొనసాగుతున్నారు.

సవాళ్లు ..
ట్రంప్ నామినేట్ చేసినప్పటికీ, వార్ష్ నియామకానికి అమెరికా సెనేట్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఒకవేళ వార్ష్ బాధ్యతలు చేపడితే, అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం, డాలర్ విలువను స్థిరీకరించడం , ట్రంప్ ప్రతిపాదించిన ‘అమెరికా ఫస్ట్’ ఆర్థిక విధానాలను అమలు చేయడంలో ఆయన పాత్ర కీలకం కానుంది. వార్ష్ సాధారణంగా ‘హకిష్’ (వడ్డీ రేట్ల విషయంలో కఠినంగా ఉండటం) వైఖరిని కలిగి ఉంటారని పేరున్నప్పటికీ, ట్రంప్ ఆదేశాల మేరకు వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆయన ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News