TVS King Kargo HD EV Launched: ఇండియాలో ప్రైవేట్ వాహనాలతో పాటు, వాణిజ్య వాహనాలకు డిమాండ్ కూడా నిరంతరం పెరుగుతోంది. ఈ దృష్ట్యా అనేక వాహన తయారీదారులు కొత్త వాహనాలను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారు. దేశంలోని ప్రముఖ వాహన తయారీదారులలో ఒకటైన టీవీఎస్ మోటార్స్ తన కొత్త త్రీ-వీల్ ఎలక్ట్రిక్ కార్గో వాహనం టీవీఎస్ కింగ్ కార్గో HD EVని లాంచ్ చేసింది. ఈ కధనం ద్వారా ఈ ఎలక్ట్రిక్ వాహనంలో ఎలాంటి ఫీచర్లు అందించారు? బ్యాటరీ- పరిధి వివరాలు, ఏ ధరకు కొనుగోలు చేయవచ్చు? వంటి పూర్తి వివరాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Also Read: Hero Glamour X : క్రూయిజ్ కంట్రోల్‌తో హీరో గ్లామర్ X లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇలా..!
తయారీదారు ఈ ఎలక్ట్రిక్ వాహనంలో LED లైట్లు, 200 mm డిస్క్ బ్రేక్, 235 mm గ్రౌండ్ క్లియరెన్స్, 26 కనెక్ట్ చేయబడిన ఫీచర్లు, పూర్తి రోల్ డౌన్ విండో, ఈ స్కూటర్‌లో మూడు డ్రైవింగ్ మోడ్‌లు వంటి లక్షణాలను అందించారు. దీనితో పాటు, దీనికి 500 mm వాటర్ వేడింగ్ కెపాసిటీ, రూఫ్ ట్రిమ్ ఆప్షన్, 28.7 శాతం గ్రేడబిలిటీ, 6.6 అడుగుల లోడింగ్ కెపాసిటీ కూడా అందించారు.
టీవీఎస్ కింగ్ కార్గో HD EVలో 8.9 KWh సామర్థ్యం గల బ్యాటరీని అందించారు. దీని పూర్తిగా ఛార్జ్ చేస్తే దాదాపు 156 కి.మీ వరకు ప్రయాణించగలదు. ఇందులో అమర్చిన బ్యాటరీతో గంటకు 60 కి.మీ వరకు గరిష్ట వేగంతో నడపవచ్చు. ఈ మూడు చక్రాల ఎలక్ట్రిక్ వాహనం 6.9 సెకన్లలో 0-30 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. టీవీఎస్ కింగ్ కార్గో HD EVని తయారీదారు భారత మార్కెట్లో రూ. 3.85 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు విడుదల చేసింది.


