Tvs Launches 6 New Products At Eicma From Electric Scooters To Hyper Stunt Bikes: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టీవీఎస్ ఒకేసారి 6 కొత్త ఉత్పత్తులను లాంచ్ చేసింది. ఇటలీలోని మిలన్‌లో జరిగిన EICMA 2025 మోటార్ షోలో టీవీఎస్ కంపెనీ ఈ 6 కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. కంపెనీ పెట్రోల్, ఎలక్ట్రిక్ వేరియంట్లలో 6 కొత్త ప్రొడక్ట్స్‌ను ప్రవేశపెట్టింది. దీనితో పాటు, కొత్త నార్టన్ సిరీస్‌ను కూడా గ్లోబల్ మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ కొత్త సిరీస్‌లో టెక్నాలజీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఆధారిత హెడ్స్-అప్ డిస్ప్లే హెల్మెట్‌లు, టూల్స్‌ను పరిచయం చేయడం ద్వారా కంపెనీ తన మార్కెట్‌ను మరింతగా విస్తరించనుంది. EICMA 2025 మోటార్ షోలో టీవీఎస్ మోటార్ ఆవిష్కరించిన ఉత్పత్తుల్లో టీవీఎస్ టాంజెంట్ ఆర్‌ఆర్ కాన్సెప్ట్ కూడా ఉంది. ఇది మోనోకోక్ సబ్‌ఫ్రేమ్‌తో కూడిన సూపర్‌స్పోర్ట్ బైక్‌గా పేరొందింది. కంపెనీ ఇప్పటివరకు దాని అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ బైక్ కాన్సెప్ట్ మోడల్, టీవీఎస్ ఈఎఫ్‌ఎక్స్ 3Oను కూడా కంపెనీ తాజాగా ఆవిష్కరించింది. కంపెనీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ మ్యాక్సీ స్కూటర్, టీవీఎస్ ఎం1-ఎస్‌ను కూడా లాంచ్ చేసింది. టీవీఎస్ అపాచీ ఆర్‌టీఎక్స్ 300తో అడ్వెంచర్ టూరర్ విభాగంలో కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది. M1-S లో ఏడు అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఉంటుంది. ఇది స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, మ్యూజిక్ కంట్రోల్, నావిగేషన్, కాల్/ఎస్‌ఎమ్‌ఎస్ అలర్ట్‌లకు సపోర్ట్ చేస్తుంది. స్మార్ట్ కీ సిస్టమ్ కూడా దీని ఫీచర్లలో ఒకటిగా ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ స్కూటర్ భారతదేశంలో లాంచ్ అవుతుందా అనేది టీవీఎస్ ఇంకా అధికారికంగా చెప్పలేదు. అయితే, దేశీయ ఈవీ మార్కెట్‌పై కంపెనీ దృష్టి పెరుగుతోంది. కాబట్టి, ఇండోనేషియాలో విడుదలైన తర్వాత M1-S భారతదేశ మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది.
EICMA 2025 ఈవెంట్‌లో టీవీఎస్ కొత్త బైక్, స్కూటర్..
టీవీఎస్ ఎక్స్-నాన్ అనే నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని పరిచయం చేసింది. ఇది స్లిమ్, ఏరోడైనమిక్, సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లతో వస్తుంది. టీవీఎస్ ఆర్‌టిఆర్ హైపర్‌స్టంట్ కాన్సెప్ట్‌ను కూడా తాజా మోటర్ షోలో ప్రదర్శించింది. ఇది రోజువారీ వినియోగం కోసం నగరాల్లో ఉపయోగించే స్పోర్ట్స్ బైక్‌గా ప్రసిద్ధి చెందింది. ఆగ్మెంటెడ్ రియాలిటీ-బేస్డ్ హెడ్స్-అప్ డిస్ప్లే హెల్మెట్‌తో సహా అత్యాధునిక రైడ్ అసిస్ట్ గేర్‌ను కూడా కంపెనీ ప్రదర్శించింది.
ఇదే ప్రదర్శనలో కొత్త నార్టన్ శ్రేణి మోటార్ సైకిళ్ళను కూడా కంపెనీ ప్రవేశపెట్టింది. EICMA 2025లో పెవిలియన్ పక్కన దీన్ని ప్రదర్శించింది. ఈ శ్రేణి డిజైన్, మొబిలిటీ, వివరాల ఆధారంగా రూపొందించింది. గత ఐదేళ్లుగా ఈ ఐకానిక్ బ్రాండ్‌ను పునరుద్ధరించడానికి టీవీఎస్ £200 మిలియన్లు పెట్టుబడి పెట్టింది.


