TVS Orbiter Electric Scooter: టీవీఎస్ మోటర్ కంపెనీ ఇటీవల భారతీయ ఆటో మార్కెట్లో టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రాక్టికాలిటీ, కనెక్టివిటీ, కంఫర్ట్ మధ్య బ్యాలెన్స్‌గా కంపెనీ ఈ స్కూటర్‌ను రూపొందించింది. ఐక్యూబ్ లో ఉపయోగించిన అదే 3.1kWh బ్యాటరీని ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లోనూ ఉపయోగించారు. అయితే ఆర్బిటర్ లో మోటార్ ట్యూనింగ్‌ను పూర్తిగా రేంజ్‌పై ఫోకస్ చేసి చేశారు. అధిక వేగం కంటే ఒకసారి ఛార్జ్‌తో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వినియోగదారులకు ఇది అనుకూలంగా ఉంటుంది. ఈ క్రమంలో చాలామందికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనే విషయంలో గందరగోళానికి గురవుతున్నారు. ఇప్పుడు టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనడానికి, కొనకపోవడానికి గల కారణాల గురించి ఇప్పుడు ఈ కధనం ద్వారా తెలుసుకుందాం.
టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనడానికి గల కారణాలు
- అద్భుతమైన డిజైన్, ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ అద్భుతంగా ఉంటుంది. దీని సీటింగ్ కూడా మెత్తగా ఉంటుంది. ఇది రైడర్ కు సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. . ఫ్రంట్ ఏప్రన్‌పై ఉన్న DRL స్ట్రిప్, అందులోనే ఇంటిగ్రేట్ చేసిన టర్న్ సిగ్నల్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇందులో 34 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్ కూడా ఉంది. ఇది హెల్మెట్ లేదా రోజువారీ నిత్యావసరాలను ఉంచడానికి సాయపడుతుంది. ముందు భాగంలో చిన్న కబ్బీహోల్, డాష్ కింద USB పోర్ట్ ఉండటం రోజువారీ ఆఫీస్, షాపింగ్ ప్రయాణాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. - మంచి రేంజ్
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేకత దీని రేంజ్. ఎంచుకున్న రైడ్ మోడ్‌ను బట్టి మంచి రేంజ్ అందిస్తుంది. సిటీ మోడ్‌లో నెమ్మదిగా నడిపితే ఫుల్ చార్జ్‌తో దాదాపు 112 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఎక్కువ బరువు మోసిన, హై స్పీడ్ రైడింగ్ అయినా దీని రేంజ్ ని తగ్గిస్తుంది. చార్జింగ్ విషయానికి వస్తే కేవలం 4 గంటల సమయంలో బ్యాటరీ 0 నుంచి 80 శాతం చార్జ్ అవుతుంది. - ధరకు తగిన ఫీచర్లు
రూ.1.05 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధునిక ఫీచర్లు, అద్భుతమైన శ్రేణి, రోజువారీ ప్రయాణానికి మంచి పనితీరు, స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. టీవీఎస్ రైడర్ లోయర్ వేరియంట్స్‌లో కనిపించే LCD స్క్రీన్ ఇక్కడ కూడా లభిస్తుంది. స్మార్ట్‌ఎక్స్‌కనెక్ట్ యాప్ ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీ అందించారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సీట్ హైట్ 760mm, కేవలం 112 కిలోల కర్బ్ వెయిట్ ఉంటుంది. దీంతో కొత్త రైడర్లకూ ఈ స్కూటర్ నడపడం చాలా సులభంగా ఉంటుంది. . క్రూయిజ్ కంట్రోల్, పార్క్ అసిస్ట్ వంటి ఉపయోగకరమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి
also read:Realme 16 5G: 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో రియల్‌మీ 16 5G లాంచ్..అదిరే ఫీచర్లు!
టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనకపోవడానికి గల కారణాల
- నగరాల్లో తక్కువ వేగం
టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి సుమారు 7 సెకన్లు పడుతుంది. నగర ట్రాఫిక్‌లో సాధారణ ప్రయాణానికి ఇది సరిపోతుంది. కానీ, వేగంగా దూసుకెళ్లే రైడింగ్‌కు అనుకూలంగా ఉండదు. ముఖ్యంగా 30 కిలోమీటర్ల లోపు యాక్సిలరేషన్ చాలా నిదానంగా అనిపిస్తుంది. ఒకసారి 50–55 కిలోమీటర్ల వేగానికి చేరుకున్న తర్వాత క్రూయిజ్ చేయవచ్చు. కానీ, ఓవర్‌టేక్ చేయాలంటే ఈ స్పీడ్ సరిపోదు. ముందుగానే పరిస్థితిని అంచనా వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న టీవీఎస్ ఐక్యూబ్ లేదా హోండా యాక్టివా లాంటి స్కూటర్లతో పోలిస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్త నిదానమే. - డిస్క్ బ్రేక్ ఆప్షన్ లేకపోవడం
ఈ స్కూటర్‌లో ముందు, వెనుక రెండూ డ్రమ్ బ్రేక్స్ మాత్రమే అందించారు. సాధారణ రోజువారీ వినియోగానికి ఇవి సరిపోతున్నా, ముందు భాగంలో డిస్క్ బ్రేక్ ఆప్షన్ ఉంటే భద్రత మరింత మెరుగ్గా ఉండేది. - హైదరాబాద్ నగరంలో టీవీఎస్ ఆర్బిటర్ ఆన్‌రోడ్ ధర
హైదరాబాద్‌లో టీవీఎస్ ఆర్బిటర్ ఆన్‌రోడ్ ధర వినియోగదారులకు ఆకర్షణీయంగా ఉంది. ఎక్స్–షోరూమ్ ధర రూ.1,04,900 కాగా, EMPS 2024 సబ్సిడీ కింద రూ.5,000 తగ్గింపు లభిస్తుంది. RTO ఛార్జీలు రూ.1,500, కంప్రెహెన్సివ్ ఇన్సూరెన్స్‌కు రూ.5,330 చెల్లించాలి.
వీటన్నింటిని కలుపుకుని హైదరాబాద్‌లో మొత్తం ఆన్‌రోడ్ ధర రూ.1,06,730గా ఉంటుంది. విజయవాడ సహా ఇతర తెలుగు నగరాల్లో కూడా స్వల్ప తేడాలతో దాదాపు ఇదే ధర కొనసాగుతుంది.
రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు, నగర వినియోగం, ఎక్కువ రేంజ్‌కు ప్రాధాన్యత ఇచ్చే వారికి టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సరైన ఎంపికగా నిలుస్తుంది. తక్కువ మెయింటనెన్స్ ఖర్చులు, సౌకర్యవంతమైన రైడ్ దీని ప్రత్యేకం. అయితే వేగం, పవర్ ఎక్కువగా కోరుకునే వినియోగదారులు ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోలు చేయాల్సిందే.

