Homeబిజినెస్Syros EV: ల్యాండ్‌మార్క్ కియాలో సరికొత్త సైరోస్ ఈవీ ఆవిష్కరణ

Syros EV: ల్యాండ్‌మార్క్ కియాలో సరికొత్త సైరోస్ ఈవీ ఆవిష్కరణ

సికింద్రాబాద్ (తెలుగు ప్రభ): తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా ల్యాండ్‌ మార్క్ కియా సరికొత్త కియా సైరోస్ ఈవీని బుధవారం సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని షోరూమ్‌లో ఆవిష్కరించింది. కార్యక్రమానికి మాజీ న్యాయమూర్తి సి.వి. రాములు, త్రికాసా టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ డి.వి. రావు, కర్నల్ శర్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ల్యాండ్‌మార్క్ కియా వైస్ ప్రెసిడెంట్ సందీప్ తో పాటు సంస్థ ప్రతినిధులు కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ప్రారంభించారు. ఆధునిక వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన సైరోస్ ఈవీలో అత్యాధునిక ఎలక్ట్రిక్ సాంకేతికత, ప్రీమియం ఇంటీరియర్, సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవం, సమగ్ర భద్రతా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. సైరోస్ ఈవీ ఒక్కసారి పూర్తి ఛార్జ్‌తో 526 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం, లెవల్-2 (అడ్వా న్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), స్మార్ట్ కనెక్టివిటీ, ప్రీమియం ఫీచర్లు, ఆధునిక ఎస్‌యూవీ డిజైన్ వంటి విశేషాలతో ఈ వాహనం వినియోగదారులను ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ల్యాండ్‌మార్క్ కియా ప్రతినిధి సందీప్ మాట్లా డుతూ, తెలంగాణ వినియోగదారులకు సైరోస్ ఈవీని పరిచయం చేయడం ఆనందంగా ఉందన్నారు. దీర్ఘ రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్, అత్యాధునిక భద్రతా సాంకేతికతలతో ఈ వాహనం ఎలక్ట్రిక్ మొబిలిటీని మరింత ఆచరణాత్మకంగా మారుస్తుందని తెలిపారు.

- Advertisement -

Also Read: Midday Meal : ‘డొక్కా సీతమ్మ’ పథకానికి అక్రమాల దెబ్బ… ఆలూరులో అల్లాడిపోతున్న అభాగ్యులు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News