UPI Safety Proposal: ప్రస్తుతం రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అందులో ఏదోక యూపీఐ యాప్ కూడా ఉంటుంది. యూపీఐ లావాదేవీలు రోజురోజుకి రికార్డులు సృష్టిస్తున్నట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు కూడా.ప్రతీరోజూ బిలియన్ల రూపాయల యూపీఐ ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సైబర్ నేరాలు కూడా అదేవిధంగా పెరుగుతున్నాయి.
ఈ సైబర్ మోసాలను అదుపు చేసేందుకు ఆర్బీఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు బ్యాంకులు ఓ ప్రతిపాదనను సూచించాయి. అనుమానాస్పద యూపీఐ లావాదేవీలు చేసేముందు కొన్ని సేఫ్టీ ఫీచర్లను పాటించాలని బ్యాంకులు తెలిపాయి.
ఆ సేఫ్టీ ఫీచర్లు ఏంటంటే..
అనుమానాస్పద లావాదేవీలు చేసే ముందు స్క్రీన్ మీద అవును..కాదు అనే ఆషన్లు కనిపించేలా ఓ చర్యను చేపట్టాలని ప్రతిపాదించాయి. అవును పై ప్రెస్ చేస్తే లావాదేవీలు వెంటనే ప్రాసెస్ అవుతుంది. కాదు అని చెబితే ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ అవుతుంది. ఈ రెండు ఆప్షన్లలో ఏది ఎంచుకోకపోతే గంటలోపు నగదు చెల్లింపులు అవుతాయి. చెల్లింపులు చేసేముందు ఒక అలర్ట్ మెస్సేజ్ తరహాలోనే ఇది ఉపయోగపడుతుంది.
Also Read:Goa: గోవాలో ఈ 10 పనులు చేశారో ఇక జైలుకే..

