న్యూఢిల్లీ(తెలుగుప్రభ): భారతదేశ డిజిటల్ చెల్లింపుల స్వరూపాన్ని పూర్తిగా మార్చేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) పదేళ్లు పూర్తి చేసుకుంది. అత్యంత వేగవంతమైన, సురక్షితమైన, సులభమైన చెల్లింపుల వ్యవస్థగా యూపీఐ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం 11 దేశాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. 2016-17లో కేవలం 1.78 కోట్లుగా ఉన్న యూపీఐ వార్షిక లావాదేవీలు 2025-26 నాటికి ఏకంగా 24,162 కోట్లకు పైగా చేరుకున్నాయి. ఇదే కాలంలో లావాదేవీల విలువ రూ.7 వేల కోట్ల నుంచి దాదాపు రూ.314 లక్షల కోట్లకు పెరిగింది. ప్రపంచ రియల్‌టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో 2025 నాటికి యూపీఐ వాటా దాదాపు 49 శాతంగా ఉంది. యూపీఐ విజయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. భారత డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో యూపీఐ కీలక మలుపుగా నిలిచిందని పేర్కొన్నారు. డిజిటల్ అంతరాన్ని తగ్గించడంతో పాటు ఆర్థిక చేరికను పెంచి, దేశవ్యాప్తంగా ప్రజలకు డిజిటల్ ఆర్థిక సేవలను చేరువ చేసిందని అన్నారు. ఫ్రాన్స్, సింగపూర్, యూఏఈ, శ్రీలంక, భూటాన్, మారిషస్ తదితర దేశాల్లోనూ యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి.
UPI: యూపీఐకి పదేళ్లు.. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

