Urban Company IPO: హోమ్ సర్వీసెస్ అందించే ప్రముఖ యాప్ ఆధారిత స్టార్టప్ అర్బన్ కంపెనీ. ఇది సెప్టెంబర్ 10న ప్రారంభించిన IPOకి ఇన్వెస్టర్ల నుంచి అనూహ్యంగా భారీ స్పందన లభిస్తోంది. ఐపీవో ద్వారా కంపెనీ మొత్తం రూ.1,900 కోట్లు ఇన్వెస్టర్ల నుంచి సమీకరిస్తోంది. ఐపీవో కోసం ప్రారంభ రెండు గంటల్లోనే 3.13 రెట్లు ప్రధానమైన డిమాండ్ వచ్చింది. రిటైల్ విభాగానికి 7 రెట్లు, ఎన్ఐఐ పోర్షన్ 4.16 రెట్లు, క్యూఐబిలకు 1.31 రెట్లు, ఉద్యోగులకు కేటాయించిన కేటగిరీల్లో 5.79 రెట్లు డిమాండ్ నమోదైంది.
ఐపీవోలో షేర్ల ధరకు ప్రైస్ బ్యాండ్ ధరను రూ.98 నుంచి రూ.103 మధ్య నిర్ణయింపబడింది. ఇప్పటికే గ్రే మార్కెట్ ప్రీమియం 35% వరకు పెరిగింది. అంటే షేరు ధర రూ. 103 గరిష్ఠ ధర పెరిగి రూ.173కు పైగా లిస్టింగ్ రోజున ప్రయాణించే అవకాశం ఉంది. ఇది పెట్టుబడిదారులకు మంచి లాభాలను వస్తాయని సూచిస్తుంది.
ఐపీవోలో కంపెనీ కొత్తగా రూ.472 కోట్ల విలువైన షేర్లు జారీ చేయగా.. మిగిలిన రూ.1,428 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా అమ్ముతోంది. ఆ సంపాదనను టెక్నాలజీ అభివృద్ధి, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మార్కెటింగ్, కార్యాలయాలు అద్దెకు వినియోగించనున్నట్లు చెబుతోంది అర్బన్ కంపెనీ.
అలాట్మెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?
* NSE, BSE అధికారిక ఐపీవో అలాట్మెంట్ చెక్ పేజీల్లో Urban Company IPO ఎంపిక చేసి PAN లేదా అప్లికేషన్ నెంబర్ నమోదు చేయాలి.
* CAPTCHA రైట్ చేసి, వివరాలు సమర్పించడంతోనే అలాట్మెంట్ స్టేటస్ కనిపిస్తుంది.
* Urban Company IPO షేర్లు సెప్టెంబర్ 15న అంటే ఇవాళ అలాట్మెంట్ అవుతాయి. మెయిన్ బోర్డ్ ఐపీవో షేర్లు సెప్టెంబర్ 17న NSE, BSEలో ఏకకాలంలో లిస్టింగ్ జరుగుతాయి.


