H-1B visa fee: అమెరికా హెచ్-1బి వీసా ఫీజులపై భారీ మార్పులు ప్రకటించడంతో భారతీయ ఐటీ నిపుణులు, కంపెనీలు ఆందోళనకు గురయ్యారు. శుక్రవారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన “రిస్ట్రిక్షన్ ఆన్ ఎంట్రీ ఆఫ్ సర్టెన్ నాన్–ఇమిగ్రెంట్ వర్కర్స్” ప్రొక్లమేషన్ ప్రకారం.. ఇప్పటి వరకు ఉన్న 2,000–5,000 డాలర్ల వీసా ఫీజు ఒక్కసారిగా లక్ష డాలర్లు (దాదాపు రూ.88 లక్షలు)కి పెంచబడింది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే అమెరికాలోనే కాక భారత్‌లోనూ పెద్ద ఎత్తున ఆందోళనలు మొదలయ్యాయి. ముఖ్యంగా అమెరికాకు వచ్చి వెళ్తున్న హెచ్-1బి వీసా హోల్డర్లు ఈ ఫీజు ఎప్పటికప్పుడు చెల్లించవలసి వస్తుందా అని కలవరపడ్డారు.
శనివారం వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ ఈ గందరగోళానికి తెరదించారు. కొత్తగా తెచ్చిన ఫీజు ఏడాదికోసారి లేదా ప్రతి సారి అమెరికాలోకి ఎంట్రీ కోసం కాదని చెప్పారు. ఇది ఒకసారి మాత్రమే కొత్త వీసా అప్లికేషన్‌కు వర్తిస్తుంది అన్నారు. ప్రస్తుతం వీసా కలిగినవారు, లేదా ఇప్పటికే అమెరికాలో పని చేస్తున్నవారు ఈ కొత్త నిబంధన వల్ల ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. అలాగే విదేశాల్లో ఉన్న హెచ్-1బి హోల్డర్లు తిరిగి అమెరికాకు వచ్చే సమయంలో ఎటువంటి అదనపు ఫీజు చెల్లించనవసరంలేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో స్వదేశాలకు వెళ్లిన వేల మంది వీసాదారులు తిరిగి అమెరికాకు వెళ్లే విషయంలో ఈ క్లారిటీతో ఊపిరి పీల్చుకుంటున్నారు.
Also Read: Gold Price Today :దసరాకు ముందు షాకిచ్చిన బంగారం.. 10 గ్రాముల ధర ఎంతో తెలుసా..?
అలాగే పాత వీసాల రెన్యువల్స్‌కు కూడా ఈ ఫీజు వర్తించదని, పూర్తిగా కొత్త వీసా అప్లికేషన్లకే మాత్రమే లక్ష డాలర్ల ఫీజు అని యూఎస్ అధికారులు క్లారిటీ ఇచ్చారు. యూఎస్ టాప్ కంపెనీలు భారత్‌లో తాత్కాలికంగా ఉన్న ఉద్యోగులను త్వరగా తిరిగి రమ్మని కోరిన నేపథ్యంలో.. అమెరికా సీనియర్ అధికారులే ప్రత్యేకంగా ప్రతిస్పందించి ఎవరూ తొందరపడి ఆదివారం లోపు తిరిగి అమెరికాకు చేరుకోవాల్సిన అవసరం లేదని వెల్లడైంది.
ఈ నిర్ణయం వల్ల అమెరికాలో కొత్త హెచ్-1బి వీసాపై ఉద్యోగం చేయాలని కలలుకంటున్న భారత ఇంజనీర్లు, ఐటీ రంగ ఉద్యోగులకు పెద్ద అవరోధం ఏర్పడనుంది. ఇప్పటికే ఉన్న ఉద్యోగులకు, రెన్యువల్స్‌కి లేదా దేశంలోకి రావడం/వెళ్ళడంపై ప్రభావం లేదని అధికారులు చెప్పినప్పటికీ, కొత్త వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి మాత్రం ఈ భారీ ఫీజు పెద్ద ఆర్థిక సవాల్‌గా మారనుంది. కంపెనీలు కూడా భవిష్యత్తులో ఇంత పెద్ద భారాన్ని మోయలేవు కాబట్టి వర్క్, ప్రాజెక్టుల డెలివరీ విషయంలో కంపెనీలు కొత్త మార్గాలను తీసుకొచ్చే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.


