VinFast EV: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగానికి వాహనదారులు మెల్లగా మైగ్రేట్ అవుతున్నారు. ప్రధానంగా పెరుగుతున్న ఇంధన ఖర్చుల నుంచి ఉపశమనం పొందే ఉద్దేశంతో ఈవీలను చూజ్ చేసుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో భారత మార్కెట్లపై దేశీయ కంపెనీలతో పాటు ఫారెన్ కంపెనీలు కూడా భారీగానే ఆశలు పెట్టుకుంటున్నాయి. తమ కొత్త కార్ మోడళ్లను ఇక్కడ విడుదల చేస్తున్నాయి. టెస్లా ఎంట్రీ తర్వాత పోటీ మరింతగా పెరిగింది.
1000 ఎకరాల ‘మెగా స్మార్ట్ సిటీ’ ప్రాజెక్టు కోసం ప్రణాళికలు చేయగా.. రాబోయే 15 ఏళ్లలో హైదరాబాద్ ఆధునిక, స్మార్ట్ మొబిలిటీకి మార్గదర్శకంగా నిలవనుంది. ఈ క్రమంలో తాజాగా వియత్నాం ఈవీ మేకర్ విన్‌ఫాస్ట్ హైదరాబాద్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా కంపెనీ VF6, VF7 మోడళ్లను పరిచయం చేస్తోంది. భారత మార్కెట్‌లోని తొలి లోకల్ అసెంబ్ల్డ్ వాహనం 2025 పండుగకాలంలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
VF6 కారు ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ SUV. మిడ్-సైజ్ సెగ్మెంట్‌లో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా దీన్ని రూపొందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 నుంచి 500 కిలోమీటర్ల రేంజ్ ఇది అందించనుంది. ఆన్‌బోర్డ్ కనెక్టివిటీ, 360° కెమెరా, వైర్లెస్ చార్జింగ్, OTA తో పాటు పనోరమిక్ సన్‌రూఫ్, లెవల్-2 అడాస్, 7 ఎయిర్ బ్యాగ్స్ దీని ప్రత్యేక ఫ్యూచర్లుగా ఉన్నాయి. ఈ మోడల్ కారు రేటు రూ.16లక్షల 49వేలుగా నిర్ణయించారు.
ఇక VF7 కారు ఒక పెద్ద SUV సెగ్మెంట్, ఫ్యామిలీ & ఎక్సిక్యూటివ్ యూజర్స్‌కు అనువుగా ఉంటుంది. దీనిలోని మోటార్ సామర్థ్యం, ఇంటీరియర్ లగ్జరీ ఇవన్నీ గ్లోబల్ ఈవీ ప్రమాణాల్లోకి తీసుకెళ్తున్నాయి. ఈ కారు కూడా 500 కిలోమీటర్ల వరకు రేంజ్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీని ధర రూ.20లక్షల 89వేలుగా కంపెనీ నిర్ణయించింది. కంపెనీ చార్జింగ్, ఆఫ్టర్ సేల్ సర్వీసుల కోసం రోడ్‌గ్రిడ్, మై టీవీఎస్, గ్లోబల్ అష్యూర్ లాంటి సంస్థలతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. రానున్న కొన్ని నెలల్లో కంపెనీ 27 నగరాలకు విస్తరించాలని నిర్ణయించింది.
విన్‌ఫాస్ట్ ఇప్పటికే తమిళనాడులో రూ.4,000 కోట్లతో ఫ్యాక్టరీను నిర్మిస్తోంది. దీని ద్వారా 50,000 కార్లు ప్రతి సంవత్సరం తయారు చేసే టార్గెట్ పెట్టుకుంది. పైగా గ్లోబల్ క్వాలిటీ స్టాండర్డ్స్‌తో భారత ఈవీ మార్కెట్‌ను ఆకట్టుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది ఈ వియత్నాం సంస్థ.


