Vinfast Limo Green Electric Car: భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా తయారీదారులు కొత్త వాహనాలను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే తమ వీఎఫ్6, వీఎఫ్7 ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్‌లో విడుదల చేసిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ విన్‌ఫాస్ట్..తన ఉనికిని మరింత విస్తరించడానికి ‘లిమో గ్రీన్’ పేరుతో కొత్త ఎలక్ట్రిక్ కారును మార్కెట్లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇది 7 సీటర్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ. ఇటీవల ఈ వాహనం భారత రోడ్లపై పరీక్షలు నిర్వహిస్తుండగా కనిపించింది. విన్‌ఫాస్ట్ ఇప్పటివరకు ఈ కారు లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించనప్పటికీ, టెస్ట్ డ్రైవ్‌లో కనిపించడం చూస్తుంటే, అతి త్వరలో భారత మార్కెట్‌లోకి రానుందని తెలుస్తోంది.
డిజైన్, లుక్
విన్‌ఫాస్ట్ లియో గ్రీన్ ఎలక్ట్రిక్ కారు వియత్నాంలో ఇటీవల విడుదలైన విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్ మోడల్‌ను ఈ భారీ కామోఫ్లేజ్ వేసిన టెస్ట్ మోడల్ పోలి ఉంది. కీలకమైన డిజైన్ అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా దాని నిటారుగా, ఎత్తైన స్టాన్స్, విలక్షణమైన నిలువు టెయిల్ ల్యాంప్‌లు, విశాలమైన గ్లాస్‌హౌస్ ఆకర్షిస్తున్నాయి. దీని అల్లాయ్ వీల్స్, టెయిల్‌గేట్ (వెనుక) ఆకారం కూడా గతంలో దాఖలు చేసిన పేటెంట్ వివరాలతో సరిపోలుతాయి. ఇది ఈ 7-సీట్ల ఎలక్ట్రిక్ SUV గుర్తింపును బలోపేతం చేస్తుంది. పక్క నుండి చూస్తే, దాని నిటారుగా ఉన్న నిష్పత్తులు విశాలత్వం, ప్రాక్టికాలిటీని సూచిస్తున్నాయి. డిజైన్ పరోక్షంగా మూడు-వరుసల సీటింగ్ కాన్ఫిగరేషన్ ఉంటుందని సూచిస్తుంది. విండ్‌షీల్డ్ ద్వారా కనిపించే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఈ వాహనం అభివృద్ధి ప్రారంభ దశలో ఉందని సూచిస్తుంది.
ఫీచర్లు, బ్యాటరీ
విన్‌ఫాస్ట్ లిమో ఎలక్ట్రిక్ కారులో LED DRLలు, LED లైట్లు, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, 170 mm గ్రౌండ్ క్లియరెన్స్, 10.1-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, నాలుగు స్పీకర్లు, సింగిల్-జోన్ AC, ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD వంటి ఫీచర్లు ఉంటాయి. ఇంటీరియర్ కూడా బ్లాక్ థీమ్‌లో ఉండవచ్చు. ఈ విన్ ఫాస్ట్ ఎలక్ట్రిక్ కారు 60.13 kWh LFP బ్యాటరీతో శక్తినిస్తుంది. ఇది ఒకే ఛార్జ్‌పై 450 కిలోమీటర్ల వరకు పరిధిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో ఈ బ్యాటరీని 10 నుండి 70 శాతం వరకు ఛార్జ్ చేయడానికి కేవలం కేవలం 30 నిమిషాలు పడుతుంది. డ్రైవింగ్ కోసం ఎకో, కంఫర్ట్, స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంటుంది. తయారీదారు ఈ వాహనాన్ని భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ MPV విభాగంలో అందించవచ్చు. ఈ విభాగంలో ఈ ఎలక్ట్రిక్ కారు కియా కారెన్స్ క్లావిస్ EV, BYD eMAX వంటి MPVలతో నేరుగా పోటీపడుతుంది.


