HomeTop StoriesVodafone Idea: వొడాఫోన్‌ ఐడియా కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్.. తక్కువ రీఛార్జ్‌కే ఎక్కువ బెనిఫిట్స్‌..!

Vodafone Idea: వొడాఫోన్‌ ఐడియా కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్.. తక్కువ రీఛార్జ్‌కే ఎక్కువ బెనిఫిట్స్‌..!

Vodafone Idea new prepaid plan benefits: ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా తన కస్టమర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. సరికొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌తో ముందుకొచ్చింది. రూ. 4600లతో వార్షిక ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను ప్రారంభించింది. అన్‌లిమిటెడ్‌ కాల్స్, డేటాతో దేశవ్యాప్తంగా ఉన్న 4జీ, 5జీ యూజర్లకు ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం, ఈ ప్లాన్‌ కొన్ని సర్కిళ్లలోనే అందుబాటులో ఉండగా.. త్వరలోనే అన్ని సర్కిళ్లకూ విస్తరించనుంది. 365 రోజుల వ్యాలిడిటీ గల ఈ ప్లాన్‌ అపరిమిత డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ ఆఫర్‌ చేస్తుంది. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, వ్యక్తిగత, నాన్‌ కమర్షియల్‌ వినియోగానికి మాత్రమే ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది. మరోవైపు, 5జీ నెట్‌వర్క్‌ కవరేజీ ఉన్న ప్రాంతంలో 5జీ అపరిమిత డేటా లభిస్తుంది. అపరిమిత డేటాపై రోజువారీ పరిమితి లేకపోయినప్పటికీ.. 28 రోజులకు గరిష్ఠంగా 300 జీబీ వరకు మాత్రమే డేటా వినియోగించుకోవచ్చు. పరిమితి మించాక డేటా స్పీడ్‌ తగ్గుతుంది. అంటే, ఈ ప్లాన్‌కు రోజుకు కేవలం రూ.12.6 చొప్పున ఖర్చు అవుతుంది. వార్షిక ప్లాన్‌తో పాటు 6 నెలల వ్యాలిడిటీతో మరో ప్లాన్‌ను కూడా వొడాఫోన్‌ ఐడియా తీసుకొచ్చింది. 180 రోజుల వ్యాలిడిటీతో రూ. 2,475 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను లాంచ్‌ చేసింది. ఈ ప్లాన్‌లోనూ అపరిమిత డేటా, అపరిమిత కాల్స్‌ అందిస్తుంది. ఈ ప్లాన్‌ కింద రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి.

- Advertisement -

Also Read: AP EAPCET: ఏపీ ఎప్‌సెట్‌ ఫలితాల విడుదల.. టాప్‌ ర్యాంకర్ల జాబితా ఇదే..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News