Homeబిజినెస్Weaver Services: వీవర్‌ కీలక ఒప్పందం.. సెంట్రమ్‌ ఫైనాస్‌ 75 శాతం వాట కొనుగోలు

Weaver Services: వీవర్‌ కీలక ఒప్పందం.. సెంట్రమ్‌ ఫైనాస్‌ 75 శాతం వాట కొనుగోలు

Weaver Services: భారతదేశంలో ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు అనేది ఒక పెద్ద కల. కానీ ఆ కలను నిజం చేసుకోవడం చాలా మందికి ఇంకా కష్టంగానే ఉంది. ఎందుకంటే చిన్న పట్టణాలు, గ్రామాలు, స్వయం ఉపాధి కార్మికులకు మధ్య తరగతి, వెనకబడిన కుటుంబాలు గృహ రుణాలు పొందడం ఒక సవాలుగా అనే చెప్పాలి. ఈ పరిస్థితిని మార్చడానికి వీవర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంది. ప్రతి ఒక్కరి సొంతింటి కల నిజం చేసుకునేలా సెంట్రమ్ హౌసింగ్ ఫైనాన్స్ తో వీవర్స్ తాజాగా ఓ ఒప్పందం చేసుకుంది.

- Advertisement -

కీలక ఒప్పందం
వీవర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్.. సెంట్రమ్ క్యాపిటల్ లిమిటెడ్ నుంచి సెంట్రమ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో 75.01% వాటాను కొనుగోలు చేసింది. ఈ ఒప్పందానికి అవసరమైన అన్ని నియంత్రణ సంస్థల వాటాదారులతో ఇప్పటికే ఆమోదం పొందింది. ఈ కొనుగోలు ద్వారా వీవర్ సర్వీసెస్ గృహ రుణాల రంగంలో మరింత బలంగా అడుగుపెట్టిందని చెప్పడంలో సందేహం లేదు.

ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం..
మన దేశంలో చాలామంది తమ సొంత ఇల్లు కలను నెరవేర్చుకోవాలని కోరుకుంటారు. అయితే కొన్ని కారణాల వల్ల ఎంతోమంది సొంతింటి కలను నిజం చేసుకోలేకపోతున్నారు. ఉదాహరణకు సరైన ఆదాయ పత్రాలు లేకపోవడం, స్థిరమైన జీతం లేకపోవడం, బ్యాంకుల కఠిన నిబంధనలు, సరైన ఆర్థిక ఉత్పత్తులు అందుబాటులో లేకపోవడం వంటి కారణాల వల్ల చిన్న వ్యాపారులు, రోజువారీ కూలీలు, స్వయం ఉపాధి ఉన్న వారు గృహ రుణాల పొందలేకపోతున్నారు.

వారి సమస్యలను అర్థం చేసుకున్న వీవర్ సర్వీసెస్ వారు అందరికి సొంతిళ్లు ఉండాలనే లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా ఎంతో మంది ప్రజలకు గృహ రుణాలు అందుబాటులోకి తీసుకురావాలనేది వీవర్స్‌ ముఖ్య ఉద్దేశం. ఈ ఒప్పందం ద్వారా చిన్న పట్టణాలు, గ్రామాలపై వెనుకబడిన కుటుంబాలకు సులభంగా లోన్స్‌ వచ్చేలా.. వాటికి కావాల్సిన పరిమిత డాక్యుమెంటేషన్, స్వయం ఉపాధి వ్యక్తులకు ప్రత్యేక రుణాలు అందేలా ప్రత్యేక దృష్టి పెట్టింది.

గృహ యాజమాన్యానికి కొత్త అవకాశాలు
ఈ ఒప్పందం వల్ల ఇంతవరకు బ్యాంకుల నుండి రుణాలు పొందలేకపోయిన కుటుంబాలకు కొత్త అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా మధ్య తరగతి మరియు తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు తమ సొంత ఇల్లు కలను నిజం చేసుకునే అవకాశం పెరుగుతుంది. వీవర్ సర్వీసెస్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల గృహ రుణ రంగంలో ఒక మంచి మార్పుకు దారితీయవచ్చు. సరళమైన, నమ్మదగిన, అందరికీ చేరువయ్యే రుణ సేవలు అందించడంతో పాటు దేశంలోని వేలాది కుటుంబాలకు సొంత ఇల్లు కల నిజం అయ్యేలా చేస్తుంది. దీంతో వీవర్స్‌ సంస్థ తీసుకున్న ఈ నిర్ణయంపై చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News