Wednesday, June 25, 2025
Homeబిజినెస్Weight loss drug: బరువు తగ్గించే మందు 'వెగోవి' ఇప్పుడు ఇండియాలో..

Weight loss drug: బరువు తగ్గించే మందు ‘వెగోవి’ ఇప్పుడు ఇండియాలో..

Weight loss drug Wegovy : డేనిష్ ఔషధ దిగ్గజం నోవో నార్డిస్క్ తన సరికొత్త బరువు తగ్గించే ‘వెగోవి’ (Wegovy)ను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది వారానికి ఒకసారి ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే మోతాదుగా అందించబడుతుంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎలి లిల్లీ మౌంజారో మాదిరిగానే వెగోవి కూడా అధిక బరువు మరియు ఒబెసిటీతో బాధపడే వ్యక్తులకు ఉపయోగపడనుంది.

- Advertisement -

“ఒబెసిటీ అనేది కేవలం వ్యక్తిగత ఆరోగ్య సమస్య కాదు, ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి మరియు జాతీయ స్థాయిలో వ్యాప్తి చెందిన మహమ్మారి. భారత్‌లో ఇటువంటి సమస్యను నిర్లక్ష్యం చేయలేం” అని నోవో నోర్డిస్క్ ఇండియా ఎండి విక్రాంత్ శ్రోత్రియా తెలిపారు. ఇండియన్ మార్కెట్‌కి అనుగుణంగా, మొదటి మూడు డోసులకి ఒకే ధరతో వెగోవి అందిస్తున్నామని, అలాగే ప్రపంచ స్థాయి పెన్ డివైస్ సౌలభ్యం కూడా ఉందని ఆయన పేర్కొన్నారు.

వెగోవి ధర ఎంత?

వెగోవి పెన్ డివైస్ ఒక నెలకు నాలుగు డోసులు కలిగి ఉంటుంది. 0.25mg, 0.5mg మరియు 1mg డోసులు.. నెలకు రూ.17,345 (ఒక్క వారం కి రూ.4,366)గా ఉంది. 1.7mg డోస్: రూ24,280, 2.4mg డోస్: రూ.26,015 గా ఉంది.

ఇది పోటీదారైన మౌంజారో తో పోల్చితే కొంచెం ఖరీదే. మౌంజారో వారం వారీగా రూ.3,500 (2.5ఎంజి), రూ.4,375 (5ఎంజి) ధరల్లో లభిస్తోంది, అంటే నెలకు రూ.14,000 – రూ.17,500 మధ్య ఉంటుంది.

ఇతర సంస్థలతో పోలిస్తే..

వెగోవిలో ఉండే ప్రధాన చురుకైన పదార్థం సెమాగ్లుటైడ్.. ఇది జిఎల్పి-1ఎ రిసెప్టర్ అగోనిస్ట్, అంటే ఇది మన శరీరంలో సహజంగా ఉండే జిఎల్పి-1 హార్మోన్‌ను అనుకరిస్తుంది. ఇది ఆకలి తగ్గిస్తుంది, గ్యాస్ట్రిక్ ఖాళీ తక్కువ చేస్తుంది మరియు బ్లడ్ షుగర్ నియంత్రణలో సహాయపడుతుంది. దీనిని మొర్బిడ్ ఒబెసిటీ ఉన్నవారికి మాత్రమే డాక్టర్లు సిఫారసు చేస్తారు. ఒజెమ్పిక్ లోనూ సెమిగ్లుటైడ్ ఉంటుంది కానీ అది మధుమేహం కోసం ఎక్కువగా వాడతారు.

ప్రయోజనాలు – శాస్త్రీయ ఆధారాలు

సెమిగ్లుటైడ్ పై జరిగిన అధ్యయనాల్లో వెగోవి వాడినవారిలో సగటుగా 15% శరీర బరువు తగ్గిందని తేలింది. కొన్ని కేసుల్లో 20% వరకు తగ్గినట్లు ఉంది. ఇది బరియాట్రిక్ సర్జరీకి సమానంగా ఉంది. కానీ మందు ఆపితే మళ్లీ బరువు పెరిగే అవకాశం ఉంది. డాక్టర్లు మసిలు నష్టంపై కూడా ఆందోళన చెందుతున్నారు.

వెగోవి వాడకంతో.. హార్ట్ ఎటాక్, స్ట్రోక్ లాంటి రిస్క్‌లు 20% తగ్గినట్లు, అలాగే మొత్తం మరణాల రిస్క్ 19% తగ్గినట్లు, హార్ట్ ఫెయిల్యూర్ 69% తక్కువగా వచ్చిందని, లివర్ ఫ్యాటీ డిపాజిట్స్ 63% మందిలో తగ్గాయని, ఫైబ్రోసిస్ కూడా 37% మందిలో మెరుగుపడిందని ఆధారాలు ఉన్నాయి. మరింత ఆసక్తికరంగా ఈ ఔషధాల వలన మెదడు ఆరోగ్యంలోనూ పాజిటివ్ ప్రభావం ఉందని, అల్జీమర్స్ వ్యాధి రిస్క్ తగ్గే అవకాశాలు ఉన్నాయని డా. అంబ్రిష్ మిథాల్ (మాక్స్ హెల్త్కేర్) వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News