Saturday, November 15, 2025
Homeబిజినెస్WhatsApp : వాట్సాప్ కొత్త అప్డేట్ చేశారా..?

WhatsApp : వాట్సాప్ కొత్త అప్డేట్ చేశారా..?

WhatsApp Accounts:ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వాడుతున్న సోషల్ మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ (WhatsApp) అగ్రస్థానంలో ఉంది. సోషల్ మీడియా యుగంలో వాట్సాప్ ఒక సంచలనం అనే చెప్పాలి. ఆండ్రాయిడ్, ఐఫోన్ అనే తేడా లేకుండా ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్ కచ్చితంగా ఉంటుంది. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు చాటింగ్, వీడియో కాల్స్, ఫైల్స్ షేరింగ్ వంటి అనేక అవసరాల కోసం యూజ‌ర్లు వాట్సాప్‌ను నిత్యం వినియోగిస్తున్నారు.

- Advertisement -

యూజర్‌లకు మెరుగైన సేవలు అందించేందుకు వాట్సాప్ మాతృసంస్థ మెటా (Meta) ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను, అప్డేట్స్‌ను తీసుకువస్తోంది. ఈ క్రమంలోనే వాట్సాప్ ఇటీవల కొన్ని ఆసక్తికరమైన అప్డేట్స్‌ను పరిచయం చేసింది. ఆ కొత్త ఫీచర్లు, వాటి వల్ల కలిగే ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రొఫైల్ వీక్షణలో మార్పులు
ఇది వరకు యాప్‌లో మన ప్రొఫైల్ (Profile) చూడాలంటే కుడిపక్కన ఉన్న మూడు డాట్స్ (…) పై క్లిక్ చేసి చూడాల్సి ఉండేది. కానీ ఇప్పుడు యూజర్‌ల సౌలభ్యం కోసం ప్రొఫైల్ ఐకాన్ యాప్‌లోని కుడి భాగంలో పైన కనిపిస్తుంది. దీనివల్ల ప్రొఫైల్‌ను యాక్సెస్ చేయడం మరింత సులభమైంది.

‘వాట్స్ ఆన్ యువర్ మైండ్’ స్టేటస్ ఫీచర్
ప్రొఫైల్‌పై క్లిక్ చేసిన తర్వాత, యూజర్‌ల మానసిక స్థితిని లేదా ఆలోచనలను వ్యక్తపరిచేందుకు కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇది దాదాపు ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మాదిరిగా వాట్స్ ఆన్ యువర్ మైండ్ (మీరు ఏమనుకుంటున్నారు?) అని అడుగుతుంది. ఈ విభాగంలో యూజర్‌లు తమ ప్రస్తుత స్థితిని తెలియజేయవచ్చు.యూజర్‌లు వీటితో పాటు తమ సొంత ఆలోచనలను కూడా రాసుకోవచ్చు.

ఇది వరకు ఎబౌట్(About) అనే ఆప్షన్ ఉండేది, కానీ ఇప్పుడు కొత్త ఫీచర్‌తో తాము రాసిన స్టేటస్ ఎంత సమయం ఉండాలో (గంట, ఒక రోజు, వారం) కూడా సెలక్ట్ చేసుకునే అవకాశం ఉంది.గతంలో ఉన్న ‘ఎబౌట్’ ఆప్షన్‌లో “బిజీ”, “ఓన్లీ కాల్స్” లాంటి ఆప్షన్స్ మాత్రమే అందుబాటులో ఉండేవి. కొత్త ఫీచర్ మరింత మెరుగైన వ్యక్తిగత వ్యక్తీకరణకు వీలు కల్పిస్తుంది.

ఒకే యాప్‌లో రెండు వాట్సాప్ అకౌంట్స్
ఈ అప్డేట్స్‌లో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ ఏదైనా ఉందంటే అది – ఒకే వాట్సాప్‌లో రెండు ఫోన్ నంబర్లతో రెండు అకౌంట్స్ (Dual WhatsApp Accounts) లాగిన్ అవ్వడం.ఈ ఫీచర్ ద్వారా ఇప్పుడు ఒకే ఫోన్‌లో, ఒకే వాట్సాప్ యాప్‌లో వ్యక్తిగత నంబర్, వృత్తిపరమైన నంబర్ (లేదా రెండు వేర్వేరు నంబర్‌లు) ఉపయోగించి రెండు వాట్సాప్ అకౌంట్‌లను నిర్వహించవచ్చు.ఇన్‌స్టాగ్రామ్ (Instagram) లో లాగిన్ టూ అదర్ అకౌంట్ అనే ఆప్షన్ ఉన్న విధంగానే, వాట్సాప్‌లో కూడా అచ్చం అలాంటి ఫీచర్ నే తీసుకువచ్చారు.

రెండు ఫోన్ నంబర్‌లతో వాట్సాప్‌ను వేరు వేరుగా వాడాలి అనుకుంటున్నవారికి, లేదా ప్రత్యేకంగా డ్యూయల్ యాప్స్ లేదా థర్డ్-పార్టీ యాప్స్‌ను ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది యూజర్‌లకు ఎంతో సమయం, శ్రమను ఆదా చేస్తుంది. ఈ కొత్త అప్‌డేట్స్ వాట్సాప్ వినియోగాన్ని మరింత సౌకర్యవంతంగా, యూజర్ ఫ్రెండ్లీగా మార్చడంలో సహాయపడతాయని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా రెండు అకౌంట్ల ఫీచర్ మల్టీ-టాస్కింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చే ఆధునిక యూజర్‌ల అవసరాలను తీరుస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad