New Delhi: ఇటీవల దేశవ్యాప్తంగా రూ.500 నోటు రద్దు అవుతుందన్న వార్తలు సామాజిక మాద్యమంలో చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని యూట్యూబ్ చానల్స్, వాట్సప్ ఫార్వార్డు మెసేజులు, ఫేస్‌బుక్ పోస్ట్‌ల ద్వారా 2026 మార్చి నాటికి రూ.500 నోట్లు చెల్లుబాటులో ఉండకపోవచ్చు అనే సమాచారం వైరల్ గా మారింది. దీంతో ఈ వార్త నిజమే అని నమ్మిన ప్రజలు ఆందోళనకు గురయ్యారు.
ఈ వార్తలపై ఆర్బీఐ మరియు కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. కేంద్ర సమాచార శాఖకు చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(PIB) ఫాక్ట్ చెక్ విభాగం ఈ వాదనను పూర్తిగా ఖండించింది. PIB ప్రకారం, రూ. 500 నోట్లు చెల్లుబాటు అవుతాయి. వాటిని రద్దు చేయబోతున్నట్టు ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రజలు ఈ రకమైన తప్పుడు వార్తలను విశ్వసించవద్దు అని సూచించింది. వీటికి సంబంధించి అధికారిక వేదికల ద్వారా మాత్రమే సమాచారం తెలుసుకోవాలని తెలిపింది.
Read more: https://teluguprabha.net/business/gold-rates-today-in-various-cities-in-india-today/
చిన్న నోట్లను ప్రోత్సహించడానికి ఏటీఎం లలో ఎక్కువగా రూ.100, రూ.200 నోట్లు ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. 2025 సెప్టెంబర్ 30 నాటికి రూ.100, రూ.200 నోట్లు 75 శాతం ఉండాలి. అలాగే మార్చి 2026 నాటికీ వీటి శాతం 90గా ఉండేలా కార్యాచరణ ప్రారంభించారు. వీటికి రూ.500 నోటు రద్దుకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసారు.
Read more: https://teluguprabha.net/business/nissan-magnite-kuro-edition-launched-in-india/
ఆర్బీఐ తాజా నివేదికల ప్రకారం, రూ.500 నోట్ల విలువ మొత్తం కరెన్సీలో 86.5% మేర విస్తరించి ఉంది. 2023-24లో రూ.2000 నోట్లను ఉపసంహరించారు. దీంతో మార్కెట్‌లో ఎక్కువగా రూ.500 నోట్లు చలామణిలో ఉన్నాయి. ఈ సందర్భంలో ప్రభుత్వం ఈ నోటును రద్దుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.


