Monday, February 16, 2026
Homeబిజినెస్Yamaha EC-06: 169 కి.మీ రేంజ్‌ తో యమహా నుంచి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది..ధరెంతో...

Yamaha EC-06: 169 కి.మీ రేంజ్‌ తో యమహా నుంచి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది..ధరెంతో తెలుసా..?

Yamaha EC-06 Launched: యమహా ఎట్టకేలకు భారత్ ఎలక్ట్రిక్ మార్కెట్లో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకొచ్చింది. కంపెనీ దీని యమహా EC-06 పేరిట విడుదల చేసింది. ఈ స్కూటర్ ప్రత్యేకంగా రోజువారీ పట్టణ వినియోగం కోసం రూపొందించబడింది. మొదట ఈ స్కూటర్‌ను ఎంపిక చేసిన నగరాల్లోని యమహా ప్రీమియం బ్లూ స్క్వేర్ షోరూమ్‌ల ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. కాగా, ఈ స్కూటర్ River Indie ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకుని రూపొందించబడింది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించి ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

యమహా EC-06- ధరెంత?
భారతీయ మార్కెట్లో యమహా EC-06 ఎక్స్-షోరూమ్ ధర రూ.167,600. ఈ స్కూటర్ బ్యాటరీపై మూడు సంవత్సరాలు లేదా 30,000 కి.మీ తయారీదారుల వారంటీతో కూడా వస్తుంది. ఈ ధర వద్ద ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రివర్ ఇండీ, ఏథర్ 450X, ఓలా S1 ప్రో, సుజుకి ఇ-యాక్సెస్ వంటి ప్రసిద్ధ ఎలక్ట్రిక్ స్కూటర్‌లతో నేరుగా పోటీ పడనుంది.

యమహా EC-06- బ్యాటరీ, రేంజ్
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఇంటర్నల్ పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ (IPMSM) ఉపయోగించారు. దీంతోపాటు 4kWh ఫిక్స్‌డ్ బ్యాటరీనిని అందించారు. ఈ సెటప్ 6.7kW పీక్ పవర్, 26Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్కూటర్ గరిష్టంగా 79 కి.మీ/గం వేగాన్ని కలిగి ఉంటుంది. దీనిని సాధారణ ఇంటి ప్లగ్‌తోనే ఛార్జ్ చేయవచ్చు. పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు 8 గంటలు పడుతుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ అవుతే, ఈ స్కూటర్ 169 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్‌ను అందిస్తుంది. ఇది రోజువారీ నగర ప్రయాణానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

also read:MG Majestor: టయోటా ఫార్చ్యూనర్‌కు పోటీగా ఎంజీ మాజెస్టర్‌..లాంచ్ డేట్, ఫీచర్లు ఇలా..!

యమహా EC-06- ఫీచర్లు, రైడింగ్ మోడ్‌లు
యమహా EC-06 మూడు రైడింగ్ మోడ్‌లతో వస్తుంది. అవి ఎకో, స్టాండర్డ్, పవర్. ఎకో మోడ్ మెరుగైన పరిధిని అందిస్తే, స్టాండర్డ్ మోడ్ బ్యాలెన్స్‌డ్ పనితీరును అందిస్తుంది. ఇక పవర్ మోడ్ వేగవంతమైన త్వరణాన్ని అందిస్తుంది. ఇరుకైన ప్రదేశాలలో సులభంగా తిప్పుకోవడానికి సహాయపడేలా రివర్స్ మోడ్ కూడా అందించారు.

యమహా EC-06- డిజైన్, హార్డ్‌వేర్
మొదట యమహా EC-06 ఒకే ఒక బ్లూయిష్ వైట్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులో తీసుకొచ్చారు. ఈ స్కూటర్ భారతదేశంలోనే రూపొందించినప్పటికీ, గ్లోబల్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని డెవలప్ చేసినట్లు యమహా చెబుతోంది. ఈ స్కూటర్ స్టైల్, ప్రాక్టికాలిటీ అండ్ పర్యావరణ అనుకూల ఎంపికను కోరుకునే పట్టణ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది.

యమహా EC-06- బ్రేకింగ్, లైటింగ్ సెటప్
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కు ముందు, వెనుక రెండింటిలోనూ 200mm డిస్క్ బ్రేక్‌లను అందించారు. అలాగే మెరుగైన, సురక్షితమైన బ్రేకింగ్ కోసం కాంబి బ్రేక్ సిస్టమ్ (CBS)ను ఇచ్చారు. అదనంగా స్కూటర్ LED హెడ్‌లైట్, టెయిల్‌లైట్‌ను కలిగి ఉండటం వల్ల రాత్రి సమయంలో మెరుగైన విజిబిలిటీని అందిస్తుంది.

యమహా EC-06- సస్పెన్షన్, డిస్ప్లే
సస్పెన్షన్ విషయానికి వస్తే, ఇది హైడ్రాలిక్ డంపర్‌లతో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌లను కలిగి ఉంది. ఇక వెనుక భాగంలో కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఉంది. ఈ స్కూటర్ కలర్ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది స్కూటర్ వేగం, బ్యాటరీ స్టేటస్, రైడింగ్ మోడ్‌లు, కనెక్టివిటీ సమాచారాన్ని సులభంగా చూడటానికి వీలు కల్పిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News