Saturday, November 15, 2025
Homeబిజినెస్Zelio Electric Scooter: ఆకట్టుకుంటున్న జెలియో కొత్త ఈ-స్కూటర్లు..సింగిల్ ఛార్జింగ్‌పై 90 కి.మీ రేంజ్..ధర తక్కువ,...

Zelio Electric Scooter: ఆకట్టుకుంటున్న జెలియో కొత్త ఈ-స్కూటర్లు..సింగిల్ ఛార్జింగ్‌పై 90 కి.మీ రేంజ్..ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ!

Zelio-eeva eco lx-eeva eco zx- eeva eco zx plus: భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న EV మార్కెట్‌లో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవడానికి జెలియో ఈ-మొబిలిటీ ఎలక్ట్రిక్ సంస్థ మార్కెట్లో మూడు కొత్త ఇ-స్కూటర్లను విడుదల చేసింది. అవి ఈవా ఎకో ఎల్ఎక్స్, ఈవా ఎకో జెడ్‌ఎక్స్, ఈవా ఎకో జెడ్‌ఎక్స్ ప్లస్‌. ఈ మూడు స్కూటర్లు ఆకర్షణీయమైన డిజైన్,గొప్ప పనితీరు, ఆధునిక ఫీచర్లతో ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయి. తయారీదారులు ఈ స్కూటర్లను ప్రత్యేకంగా యువత, మహిళా రైడర్లు, సిటీ రైడింగ్ కోరుకునే వారికి రూపొందించారు. సింగిల్ ఛార్జింగ్‌పై 90km ప్రయాణం చేయొచ్చు. ఇప్పుడు జెలియో-ఈవా ఎకో ఎల్ఎక్స్, ఈవా ఎకో జెడ్‌ఎక్స్, ఈవా ఎకో జెడ్‌ఎక్స్ ప్లస్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

.

ఈవా ఎకో ఎల్ఎక్స్ ధర, ఫీచర్లు:

కంపెనీ ఈ చౌకైన మోడల్ ఈవా ఎకో ఎల్ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.51,551(ఎక్స్-షోరూమ్)గా పేర్కొంది. ఇది 48/60V BLDC మోటారును కలిగి ఉంటుంది. సింగల్ ఛార్జ్‌పై దాదాపు 60 నుండి 90 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ కేవలం 1.5 యూనిట్ల విద్యుత్తును ఉపయోగించి ఛార్జ్ చేస్తుంది. ఈవా ఎకో ఎల్ఎక్స్ రెండు బ్యాటరీ ఎంపికలతో వస్తుంది. 48-60V/32Ah GEL, 60V/30Ah లిథియం. ఇక ఫీచర్లు చూస్తే ఇందులో డ్రమ్ బ్రేక్‌లు, హైడ్రాలిక్ సస్పెన్షన్, 36 లీటర్ల బూట్ స్పేస్ వంటివి ఉన్నాయి. ఇది నలుపు, బూడిద, ఎరుపు, నీలం వంటి నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంది.

also read:Audi Q3 and Q5 Signature Line: మార్కెట్లోకి ఆడి క్యూ3, క్యూ5 సిగ్నేచర్ లైన్..ధరెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?!

ఈవా ఎకో జెడ్‌ఎక్స్ ధర, ఫీచర్లు:

రెండవ మోడల్ ఈవా ఎకో ZX ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.53,551 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఇది ఈవా ఏకో ఎల్ఎక్స్ మాదిరిగా ఉంటుంది. కానీ, కొద్దిగా భిన్నమైన డిజైన్, టైర్ సైజును కలిగి ఉంటుంది. ఇది 90-90/12 ముందు టైర్లు, 90-100/10 వెనుక టైర్లను కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ఎంపికలలో 12-32Ah GEL, 60V/30Ah లిథియం ఉన్నాయి. ఈ మోడల్‌ గ్లోసీ వైట్ కలర్లో కూడా అందుబాటులో ఉంటుంది.

ఈవా జెడ్‌ఎక్స్ ప్లస్ ధర, ఫీచర్లు:

లైనప్‌లో అత్యంత అధునాతన మోడల్ ఈవా జెడ్‌ఎక్స్ ప్లస్ (ఫేస్‌లిఫ్ట్). దీని ధర రూ.65,051 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఇది 60/72V BLDC మోటార్ మోటార్ ఎంపికలను కలిగి ఉంది. విభిన్న బ్యాటరీ కలయికలను కలిగి ఉంది. ఇవి 12-32Ah/42Ah GEL నుండి 60V/30Ah-72V/32Ah లిథియం వరకు ఉంటాయి. ఫీచర్ల చూస్తే, ఈ మోడల్ ముందు డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్‌తో వస్తుంది. టైర్ సైజు 90-90/12 పరిమాణాలు, మంచి రైడింగ్ అనుభవాన్ని అందిస్తాయి.

also read:Oppo Reno 14F 5G Star Wars Edition: ఒప్పో స్టార్ వార్స్ ఎడిషన్ ఫోన్ లాంచ్ కు సిద్ధం..6,000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌..

ఇతర ఫీచర్లు, బుకింగ్స్:

కంపెనీ మూడు స్కూటర్లలో డిజిటల్ స్మార్ట్ డిస్ప్లే, కీలెస్ స్టార్ట్, క్రూయిజ్ కంట్రోల్, ఫైండ్-మీ ఫంక్షన్, ఇమ్మొబిలైజర్ సిస్టమ్, యాంటీ-థెఫ్ట్ అలారం, USB ఛార్జింగ్ పోర్ట్, ఆల్-LED లైటింగ్ సిస్టమ్ వంటి అనేక స్మార్ట్ ఫీచర్లను అందించింది. ఈ అన్ని మోడళ్లపై కంపెనీ రెండు సంవత్సరాల వారంటీ అందిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న జెలియో డీలర్‌షిప్‌లలో కొత్త ఈవా స్కూటర్ శ్రేణి కోసం బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad