Canara Bank Notification: నిరుదోగ్య అభ్యర్థులకు గుడ్ న్యూస్. కెనరా బ్యాంక్ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. కెనరా బ్యాంక్ ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉన్న ప్రముఖ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ నుంచి 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ కు 3500 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు భర్తీకి భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆలస్యం చేయకుండా ఆసక్తి, అర్హత ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ క్రమంలో నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఖాళీల సంఖ్య: 3500
పోస్ట్ లు: గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ షిప్ పోస్టులు: 3500 పోస్టులు
కేటగిరీ వారీగా పోస్టులు: ఎస్సీ- 557 పోస్టులు, ఎస్టీ- 227 పోస్టులు, ఓబీసీ- 845 పోస్టులు, ఈడబ్ల్యూఎస్-337 పోస్టులు, యూఆర్-1534 పోస్టులు
తెలుగు రాష్ట్రాల్లో వెకెన్సీలు: ఆంధ్రప్రదేశ్-242 పోస్టులు, తెలంగాణ-132 పోస్టులు
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీన నుంచి 2022 జనవరి 1 నుంచి 2025 సెప్టెంబర్ 1 మధ్యలో డిగ్రీ పాసై ఉండాలి.
వయోపరిమితి: 2025 సెప్టెంబర్ 1 నాటికి 20 నుంచి 28 ఏళ్ల వయస్సు మించకూడదు. నిబంధనల ప్రకారం..ఓబీసీలకు మూడేళ్లు, బీసీలకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీకు ఐదేళ్ల వరకు వయస్సు సడలింపు ఉంటుంది.
స్టైఫండ్: నెలకు రూ.15000
ట్రైనింగ్ పీరియడ్: సంవత్సరం
దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం
దరఖాస్తు చివరి తేదీ: 2025 అక్టోబర్ 12
దరఖాస్తు ఫిజు: రూ.500 ఫీజు ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అఫీషియల్ వెబ్ సైట్: https://canarabank.bank.in/pages/Recruitment


