80 job Vacancys in BDL Hyderabad: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలోని బీడీఎల్ (భారత్ డైనమిక్స్ లిమిటెడ్) వివిధ విభాగాల్లో 80 మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీడీఎల్ హైదరాబాద్ కేంద్రంలోనే ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత గల డిగ్రీ, పీజీ, డిప్లొమా పాసైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఆకర్షనీయమైన వేతనం పొందవచ్చు. ఎంపికైన వారు ప్రతినెలా రూ.40 వేల నుంచి లక్ష నలబై వేల రూపాయల వరకు జీతం పొందవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఉద్యోగ ఖాళీలు, విద్యార్హత, జీతం, ఉద్యోగ ఎంపిక విధానం, వయస్సు, దరఖాస్తు విధానం తదితర వివరాల గురించి తెలుసుకుందాం. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా హైదరాబాద్ బీడీఎల్ సెంటర్‌లోని ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, మెటలర్జీ, కెమికల్, సివిల్, ఫైనాన్స్, హ్యూమన్ రీసోర్స్ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనుంది. ఇప్పటికే ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ.. ఈ నెల 29 వరకు కొనసాగనుంది. పూర్తి వివరాలను https://bdl-india.in/recruitments వెబ్ సైట్‌లో చూడొచ్చు.
అర్హత
పోస్టును బట్టి సంబంధిత ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, మెటలర్జీ, కెమికల్, సివిల్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్స్ విభాగాల్లో 55 నుంచి 60 శాతం మార్కులతో డిగ్రీ పాసై ఉండాలి.
పోస్టుల వారీగా ఖాళీలు
ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో 55 నుంచి 60 శాతం మార్కులతో డిగ్రీతో పాటు పీజీ, డిప్లొమా కూడా పూర్తి చేసి ఉండాలి. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, మెటలర్జీ, కెమికల్, సివిల్, ఫైనాన్స్, హ్యూమన్ రీసోర్స్, లా విభాగాల్లో డిగ్రీ పాసై ఉండాలి.
కేటగిరీ వారీగా వయోపరిమితి..
ఇక, వయోపరిమితి విషయానికి వస్తే.. 2025 నవంబర్ 25 నాటికి అభ్యర్థుల వయస్సు 27 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయో సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
జీత భత్యాలు ఇలా..
ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.40 వేల నుంచి రూ.1,40,000 వరకు జీతం ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్..
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ముందుగా 2 గంటల కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ఉంటుంది. ఇందులో నుంచి 85 శాతం వెయిటేజీ ఇస్తారు. మిగతా 15 శాతం ఇంటర్వ్యూకు కేటాయిస్తారు. హైదరాబాద్, విజయవాడతో పాటు అహ్మాదాబాద్, గాంధీనగర్, బెంగళూర్, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, ఢిల్లీ, కోల్ కత్తా, లక్నో, ముంబై, త్రివేండ్రం తదితర నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.

