Tribal residential schools: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 31 గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ 5వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన విద్యార్థులు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని గురుకుల విద్యాలయాల సంస్థ తెలిపింది. ఎంపికైన వారికి ఇంగ్లిష్ మీడియంలో ఉచిత విద్య, వసతితో పాటు జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందిస్తారు.
ముఖ్యమైన తేదీలు:
- ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: ఫిబ్రవరి 5, 2026
- దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 28, 2026
- హాల్ టికెట్ల విడుదల: మార్చి 10, 2026
- ప్రవేశ పరీక్ష తేదీ: ఏప్రిల్ 4, 2026
- ఫలితాల విడుదల: ఏప్రిల్ 29, 2026
అర్హతలు: ప్రస్తుతం (2025-26) ఏదైనా ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలల్లో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 1 లక్షకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలు 13-09-2013 నుండి 31-08-2017 మధ్య; బీసీ, ఓసీలు 01-09-2015 నుండి 31-08-2017 మధ్య జన్మించి ఉండాలి.
పరీక్షా విధానం: ప్రవేశ పరీక్ష మొత్తం 50 మార్కులకు ఆబ్జెక్టివ్ (MCQ) విధానంలో ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉండవు.
- తెలుగు: 10 మార్కులు
- ఇంగ్లిష్: 10 మార్కులు
- గణితం: 15 మార్కులు
- పరిసరాల విజ్ఞానం (EVS): 15 మార్కులు
సీట్ల వివరాలు & రిజర్వేషన్: ప్రతి పాఠశాలలో 80 సీట్లు (రెండు సెక్షన్లు) అందుబాటులో ఉంటాయి. ఇందులో ఎస్టీలకు 78%, ఎస్సీలకు 12%, బీసీలకు 5%, ఓసీలకు 2%, ఏఈక్యూ (AEQ) కోటా కింద 3% సీట్లు కేటాయిస్తారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. అర్హత గల విద్యార్థులు గడువులోగా అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

